manakondur
-
‘అన్నా నాకిక దిక్కెవరూ’
ఇల్లంతకుంట(మానకొండూర్): ఏడాది క్రితం తండ్రి గుండెపోటుతో.. తల్లి అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుంచి అన్నీ తానై తోడునీడగా ఉన్న అన్న మృతితో 11 ఏళ్ల బాలిక ఒంటరైంది. ‘అన్నా నాకిక దిక్కెవరూ’ అని ఏడుస్తూ అన్న మృతదేహానికి తలకొరివి పెట్టడం గ్రామస్తులను కలచివేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన నాయిని రాజేశం– దేవవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు వందన, సంజన, కొడుకు వంశీ (25) సంతానం. ఉపాధి కోసం రాజేశం దుబాయ్ వెళ్లేవాడు. ఉన్నంతలో పెద్ద కూతురు వందనకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. ఏడాది క్రితం రాజేశం దుబాయ్‌లో గుండెపోటుతో చనిపోయాడు. అప్పటికే దేవవ్వ కేన్సర్ బారినపడి మృతిచెందింది. ఆమె దహనసంస్కారాలు జరిగిన మూడు రోజులకే దుబాయ్ నుంచి రాజేశం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అతడి అంత్యక్రియలను కొడుకు నిర్వహించాడు. అప్పటి నుంచి సంజన ఆలనపాలనను వంశీ చూసుకుంటున్నాడు. తల్లిదండ్రులు చనిపోయి ఏడాది అవుతుండగా, మంగళవారం వంశీ సైతం కిడ్నీలు పాడయి అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో సంజన ఒంటరయింది. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. చిన్న వయస్సులో అన్నకు తలకొరివి పెట్టడం చూసి గ్రామస్తులు కన్నీరుపెట్టారు. -
కళ్లెదుటే కన్నకొడుకు సజీవ దహనం.. పాపం ఆ తల్లి..
మానకొండూర్: ఆరేళ్ల బాలుడు మిట్టమధ్యాహ్నం ఇంట్లో గాఢనిద్రలో ఉన్నాడు.. హఠాత్తుగా శరీరానికి వేడి తాకింది. నిద్రలోంచి తేరుకున్న ఆ చిన్నారి చుట్టూ మంటలు.. అమ్మా.. అమ్మా.. అంటూ హాహాకారాలు చేస్తూ ప్రాణాలు కాపాడుకునేందుకు మరోగదిలోకి పారిపోయాడు. ఇంటి ఆవరణలో కొంత దూరంలో ఉన్న తల్లి మంటలను గమనించింది. కొడుకును కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఊపిరాడక ఆ చిన్నారి ప్రాణాలు వదిలాడు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ విషాదంపై స్థానికులు తెలిపిన వివరాలివి.ఈదులగట్టెపల్లి గ్రామానికి చెందిన అగ్గిడి రాజు, అనిత దంపతులకు రితిక, కొడుకు సాయికుమార్ (6) సంతానం. సాయికుమార్ కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. రాజు ఆటో డ్రైవర్, అనిత కూరగాయలు అమ్ముతుంది. దీంతోపాటు సీజన్లో టార్పాలిన్లు (పరదాలు) కిరాయికి ఇస్తూ ఉపాధి పొందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో కూలర్ వేసుకుని సాయికుమార్ నిద్రిస్తున్నాడు. అనిత, రితిక ఇంటికి కొంతదూరంలో చెట్టు కింద కూర్చుకున్నారు. విద్యుదాఘాతంతో ఇంటి ఎదుట పందిరికి మంటలు అంటుకుని ఇంట్లోని టార్పాలిన్లకు వ్యాపించాయి.నిద్రలో ఉన్న సాయికుమార్ గమనించి ‘అమ్మా.. అమ్మా.. మంటలు’అంటూ ఏడుస్తూ అరిచాడు. గమనించిన తల్లి అనిత ఇంటి వద్దకు పరుగు తీసింది. అప్పటికే మంటలు ఎగిసిపడుతున్నాయి. కొడుకును కాపాడుకునేందుకు తల్లి చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ క్రమంలో ఆమెకూ గాయాలయ్యాయి. మంటలు మరింత వ్యాపించడంతో బాలుడు తన ప్రాణాలు కాపాడుకునేందుకు.. ఇంట్లోని మరోగదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. చదవండి: ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్యస్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి అగ్నిమాపక శకటం చేరుకుని, మంటలార్పగా.. అప్పటికే మంటల వేడి తాళలేక, పొగతో ఊపిరి ఆడక బాలుడు మృతి చెందాడు. ఇంట్లోని సామగ్రి కాలిబూడిదైంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు కళ్లెదుటే మంటల్లో కాలిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మానకొండూర్ ఇన్చార్జి సీఐ స్వామి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మూడు రోజుల రెక్కీ.. వెంటాడి.. వేటాడి..
మానకొండూర్: ఓ యువకుడిని చంపేందుకు మూడు రోజులు రెక్కీ నిర్వహించారు. విషయం తెలిసి సదరు యువకుడు ప్రాణాలు కాపాడుకునేందుకు పొరుగూరిలో దాక్కున్నాడు. పసిగట్టిన ప్రత్యర్థులు వెంబడించారు. తప్పించుకునే క్రమంలో బావిలో పడ్డాడు. అయినా వదలని ఆ దండగులు ఆ యువకుడిని బావి నుంచి బయటకు తీసి తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. చివరకు సదరు యువకుడు పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి– కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వెల్ది గ్రామాల మధ్యలోని మానేరు వాగులో శవమై కనిపించాడు. స్థానికుల కథనం ప్రకారం.. మానకొండూర్ మండలం పచ్చునూరుకు చెందిన గోపు ప్రశాంత్ రెడ్డి(23) మంగళవారం ఉదయం కిడ్నాప్‌నకు గురై సాయంత్రం శవమై కనిపించడంతో గ్రామం ఉలిక్కిపడింది. గ్రామానికి చెందిన గోపు రమ, రఘునాథరెడ్డికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు శ్యాంసుందర్ వరంగల్‌లో ఉంటున్నాడు. చిన్న కొడుకు ప్రశాంత్‌రెడ్డి (23) ఇంటర్ పూర్తిచేసి ఇంటివద్దే ఉంటున్నాడు. పదేళ్లక్రితం తల్లి రమ, ఆరేళ్ల క్రితం తండ్రి రఘునాథరెడ్డి అనారోగ్యంతో చని పోయారు. ఒంటరిగానే ఇంటివద్ద ఉంటున్న ప్రశాంత్‌రెడ్డిపై పోలీసు కేసులు ఉన్నట్లు సమాచారం. కొద్దిరోజులుగా ప్రశాంత్‌రెడ్డికి స్థానికంగా ఉండే రమేశ్ ఉరఫ్ జానీతో ఓ భూమి సెటిల్మెంట్ వ్యవహారంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో ‘నిన్ను చంపుతా.. అంటే నిన్నే చంపుతా’ అంటూ తరచూ ఒకరినొకరు చాలెంజ్ చేసుకుంటున్నారు.ఎక్కడ ప్రశాంత్‌రెడ్డి తనను చంపుతాడోననే భయంతో రమేశ్ తన ఫ్రెండ్ గాజు శంకర్, మరికొందరి సహకారంతో ప్రశాంత్‌ను అంతమొందించాలని ప్రణాళిక రచించారు. మూడు రోజులుగా ఆయ న ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు స మాచారం. ప్రత్యర్థుల వ్యూహాన్ని పసిగట్టిన ప్రశాంత్ అప్రమత్తమయ్యాడు. తనకు సాయం చేయాలని గ్రామంలో పలువురిని కోరాడు. సోమవారం సాయంత్రం ఊటూరులోని ఓ మిత్రుడి వద్దకు వెళ్లాడు. తనకు రూ.500 ఇచ్చి ఈ రాత్రికి ఆశ్రయం కల్పిస్తే ఉదయాన్నే జమ్మికుంట వెళ్లి, అక్కడి నుంచి హన్మకొండలోని తన సోదరుడి వద్దకు వెళ్తానని తెలిపాడు.బావిలో పడ్డా.. రాళ్లతో కొట్టి..బయటకు తీసి.. సోమవారం రాత్రి రమేశ్ ఆయన అనుచరులు పచ్చునూరులో ప్రశాంత్‌రెడ్డి గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఊటూరు వెళ్లాడని తెలుసుకుని మంగళవారం వేకువజామున ఐదుగంటల ప్రాంతంలో ఆ గ్రామానికి వెళ్లారు. శివారులోని ఓ శివాలయం వద్ద ఓ హనుమాన్ మాలధారుడితో ప్రశాంత్‌రెడ్డి గురించి వాకబు చేశారు. సదరు భక్తుడి సెల్‌ఫోన్ తీసుకుని ప్రశాంత్‌రెడ్డి నంబరుకు ఫోన్ చేశారు. సమీపంలోనే ఫోన్ రింగ్ శబ్ధం రావడంతో అతడిని వెంబడించారు. గమనించిన ప్రశాంత్‌రెడ్డి తప్పించుకునే క్రమంలో సమీపంలో ఉన్న ఓ పాడుబడ్డ బావిలో పడ్డాడు. అయినా వదలని దుండగులు రాళ్లతో దాడిచేశారు. తీవ్రగాయాలైనా.. వదలకుండా తాడుసాయంతో బావిలోంచి బయటకు తీసి ఉదయం 6 గంటల ప్రాంతంలో జీప్‌లో ఎక్కించుకొని గ్రామం నుంచి తీసుకెళ్లారు.ఆ 12 గంటలు..కిడ్నాప్ గురించి పోలీసులకు సమాచారం అందడంతో ఉదయం 6గంటలకు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ, మానకొండూర్ సీఐ మాదాసు రాజ్‌కుమార్ హుటా హుటిన ఊటూరు గ్రామానికి చేరుకుని ప్రశాంత్‌రెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 12 గంటల పాటు పలు గ్రామా ల్లో సీసీ ఫుటేజీలు పరిశీలించారు. వాటి ఆధారంగా వేగురుపల్లి శివారులోని మానేరువాగుకు జీపులో వెళ్లినట్లు గుర్తించారు. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి– మా నకొండూ ర్ మండలం వెల్ది మధ్యలో ఉన్న మానేరు వాగులో ప్రశాంత్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. ప్రశాంత్‌రెడ్డిని హత్య చేసింది రమేశ్ అనే వ్యక్తిగా సమాచారం. కాగా.. పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. ప్రశాంత్ ను దారుణంగా హింసించి, పైశాచికంగా చంపినట్లు అతని మృతదేహాన్ని బట్టి తెలు స్తోంది. హత్యకు ఆధిపత్య పోరా? పాత కక్షలు కారణమా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు గంజాయి మత్తులో ఇలా పైశాచికంగా ప్రవర్తించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి. గతేడాది ఏప్రిల్‌లోనూ గంజాయి తాగి వచ్చిన కొందరు మానకొండూరులో తుపాకీతో కాల్పులు జరిపేందుకు యత్నించారు. ఆ ఘటనతో పోలికలుండడం బలాన్ని చేకూరు స్తున్నాయి. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రాజ్‌కుమార్ వివరించారు. -
ఎలుగుబంటి హల్చల్.. టెన్షన్లో ప్రజలు..!
-
కరీంనగర్లో ఆపరేషన్ బంటి సక్సెస్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ మానుకొండూరులో అటవీ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ బంటి సక్సెస్ అయ్యింది. మత్తు మందు ఇచ్చి ఎలుగును బంధించిన అధికారులు చికిత్స కోసం వరంగల్‌కు తరలించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం మానకొండూరు హనుమాన్ టెంపుల్ వద్ద ఎలుగుబంటి ఓ ఇంట్లోకి చొరబడింది. అనంతరం, వీధి కుక్కలు ఎలుగుబంటిని తరమడంతో అది పరుగులు తీసి చెట్టుపైకి ఎక్కి కూర్చుంది. దీంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో గ్రామస్తులు.. పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. ఎలుగును బంధించే ప్రయత్నం చేశారు. అయితే అది చిక్కకుండా తప్పించుకుంది. మానకొండూరు చెరువువైపు ఉన్న పొదల్లోకి ఎలుగు పారిపోయింది. దీంతో అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ జరిపి.. మత్తు మందు ఇచ్చి ఎట్టకేలకు దానిని బంధించారు. -
మానకొండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిలిపి చేష్టలు.. వీడియో వైరల్
సాక్షి, కరీంనగర్: ప్రపంచ వ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటలతో హోరెత్తించారు. కేక్ కట్ చేసి, పటాకులు కాల్చి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. అయితే కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.. నియోజకవర్గంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో అత్యుత్సాహం ప్రదర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిలిపి చేష్టలు న్యూ ఇయర్ వేడుకల్లో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిలిపి చేష్టలు. pic.twitter.com/wvyvurebqp — Telugu Scribe (@TeluguScribe) January 2, 2024 కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో సత్యనారాయణ చిలిపి చేష్టలు చేశారు. కేక్ కటింగ్ సందర్భంగా అక్కడున్న మహిళా కార్యకర్త ముఖానికి ఆయన కేక్ పూయగా, ఆమె పక్కకు తప్పుకుంది. అయితే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పక్కకు జరిపి మరీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆ మహిళా కార్యకర్తకు కేక్ పూశారు. దీంతో సదరు మహిళ కాస్తా ఇబ్బందిగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మానకొండూరు ఎమ్మెల్యేపై నెటిజన్లు, స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కాంగ్రెస్ నాయకుల అసలు నైజం...! సభ్య సమాజం తలదించుకునేలా మహిళతో మానకొండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యనారాయణ అసభ్య ప్రవర్తన. దేశం మొత్తం నీతులు బోధించే ప్రియాంక గాంధీకి ఈ విషయం పట్ల స్పందించే ధైర్యం ఉందా...? pic.twitter.com/4wwNVCO9Qb — Sumiran Komarraju (@SumiranKV) January 2, 2024 -
కరీంనగర్లో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. అరుణ్ జస్ట్ మిస్!
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. ఇద్దరు రౌడీలు మరో రౌడీషీటర్‌పై తపంచాతో కాల్పులు జరిపారు. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాషబోయిన అరుణ్ అనే రౌడీషీటర్‌పై ఇద్దరు వ్యక్తులు అతని ఇంట్లోనే దాడికి పాల్పడ్డారు. అసలేం జరగుతుందో తెలుసునేలోపే తపంచాతో కాల్పులకు దిగారు. కొద్దిలో గురి తప్పడంతో అరుణ్ ప్రాణాలతో బయటపడి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో ఆ ఇద్దరు రౌడీలు ఆ ఇంటిని ధ్వంసం చేశారు. అరుణ్ ఎక్కడున్నాడో తెలపాలని కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు. ఇది తెలుసుకున్న స్థానికులు అరుణ్ కుటుంబ సభ్యులను కాపాడారు. ఇద్దరు రౌడీలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఒకరు యాదాద్రి జిల్లాకు చెందిన పాల మల్లేష్ మరొకరు మానుకొండూరుకు చెందిన బైరగోని మధు అని పోలీసుల విచారణలో తెలిసింది. -
కరీంనగర్ జిల్లా మానకొండూరులో అర్ధరాత్రి కాల్పుల కలకలం
-
కరీంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా..
సాక్షి, కరీంనగర్/ వరంగల్: కరీంనగర్ జిల్లా మానకొండూరు శివారు ప్రాంతంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హనుమకొండ నుంచి వేములవాడకు వెళ్తున్న ఏపీ 36ఏటీ 0648 గల మారుతి ఆల్టో కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కూతురికి వీసా రావడంతో కారులో మృతి చెందిన ఇద్దరిని వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన భార్యాభర్తలు మాధవి, సురేందర్‌గా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన దంపతుల్లో సురేందర్ ప్రమాద స్థలలోనే చనిపోగా మాధవి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న తమ కూతురు మేఘన, మేనల్లుడు అశోక్ గాయపడ్డారు. వీరి పరిస్థితి ప్రస్తుతం విషయంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాశీబుగ్గలో విషాదం అయితే కూతురు మేఘనకు అమెరికా వీసా రావడంతో కుటుంబమంతా వేములవాడ రాజన్న దేవాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దైవదర్శనం కోసం శనివారం ఉదయం కారులో వేములవాడకు బయలుదేరగా.. మార్గమధ్యలో మానకొండూర్ మండలం ముంజంపల్లి వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం తెలియడంతో కాశీబుగ్గలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. చదవండి: పెళ్లికి పెద్దలు నిరాకరించారని.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం -
కారం చల్లి, గొడ్డలితో సాఫ్ట్వేర్ ఉద్యోగిపై దాడి.. ఆయుధాన్ని బీరువా కింద దాచి..
సాక్షి, గన్నేరువరం(మానకొండూర్): మండలంలోని జంగపల్లిలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ జక్కనపెల్లి ఆంజనేయులు, భారతి దంపతుల కుమారుడు అశోక్ హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం రాంహనుమాన్ నగర్‌కు చెందిన అతని తాత లింగయ్య(తల్లికి తండ్రి) ఇటీవల మృతి చెందాడు. గురువారం దినకర్మ ఉండటంతో అశోక్ బుధవారం రాత్రి గ్రామానికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి గురువారం ఉదయం రాంహనుమాన్ నగర్ వెళ్లాడు. మధ్యాహ్నం తండ్రితో కలిసి ఇంటికి చేరుకున్నాడు. అశోక్ వంటింట్లో నిద్రిస్తుండగా, తండ్రి ఆంజనేయులు, నానమ్మ రాజవ్వ గ్రామంలోనే కొద్ది దూరంలో ఉన్న మరో ఇంట్లో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో అశోక్ ఉన్న ఇంట్లోకి గ్రామానికే చెందిన వెల్దిండి రవీందర్ ప్రవేశించాడు. అశోక్ ముఖంపై కారం చల్లి, గొడ్డలితో దాడి చేశాడు. బాధితుడు కేకలు వేయడంతో పారిపోయాడు. చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుమారుడి ఒంటిపై ఉన్న గాయాలను చూసి, అశోక్ తండ్రి బోరున విలపించారు. బాధితుడిని కరీంనగర్ ఆస్పపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తేల్చారు. వారి సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. నిందితుడు గొడ్డలిని బాధితుడి ఇంట్లో బీరువా కింద దాచాడు. అనంతరం పోలీస్‌స్టేషన్ లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సై మామిడాల సురేందర్‌లు పరిశీలించారు. గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మద్యానికి బానిస నిందితుడు రవీందర్ కొన్నేళ్ల కిందట దుబాయి వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి గ్రామంలోనే ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడని చెప్పారు. ఈ క్రమంలో మద్యానికి బానిసై కనిపించినవారిని డబ్బులు డిమాండ్ చేస్తుంటాడని అన్నారు. కానీ అశోక్‌తో అతనికి పరిచయం లేదని, రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు తేవని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. మద్యం, గంజాయి మత్తుకు మానిసై సైకోగా మారి, దాడి చేసి ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సరఫరా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. -
కరీంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
సాక్షి, కరీంనగర్: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు మానకొండూరు పోలీస్ స్టేషన్ ప్రాంతంలో అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఒకరికి తీవ్ర గాయలవ్వగా ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా కల్లూరులో దశ దినకర్మకు వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులు కరీంనగర్‌లోని జ్యోతినగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. చదవండి: తెలంగాణలోనూ ఆన్లైన్ టికెట్ విధానం పెట్టండి: నిర్మాత కారులో ప్రయాణిస్తున్న కొప్పుల శ్రీనివాస రావు, కొప్పుల బాలాజీ శ్రీధర్, ఇందూరి జలంధర్, శ్రీరాజు మృతి చెందగా.. మరో వ్యక్తి పెంచాల సుధాకర్ రావుకు తీవ్రగాయాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే నిద్రమత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు -
తమ్ముడికి కాల్ చేసి బైక్ తీసుకెళ్లమని చెప్పి.. యువకుడు ఆత్మహత్య
సాక్షి, తిమ్మాపూర్(మానకొండూర్): ఎంటెక్‌లో సీటు రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్ఎండీ ఎస్ఐ ప్రమోద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్‌కు చెందిన ఎండీ షఫీ(26) ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఎంటెక్ కోసం ఇటీవల ఎంట్రెన్స్ రాయగా సీటు రాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఎంటెక్ చేయకపోతే మంచి ఉద్యోగం రాదని నిరాశకు లోనయ్యాడు. బుధవారం ఉదయం ఇంట్లో బయటికి వెళ్తున్నానని చెప్పి అలుగునూరు శివారులోని కాకతీయ కాలువ వద్దకు వెళ్లాడు. చదవండి: కన్న తండ్రిపై అమానుషం.. పీకల దాక మద్యం తాగి.. ఆపై నూనె చల్లి.. అక్కడ తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి వేసి తన తమ్ముడికి కాకతీయ కెనాల్ వద్ద బైక్ ఉంది తీసుకెళ్లాలని మెసేజ్ చేశాడు. ఆ వెంటనే ఫోన్ స్విచాఫ్ చేశాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కెనాల్ వెంట వెతుకుతుండగా బైక్ కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కెనాల్లో గాలించగా మృతదేహం బయటపడింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: నటి షాలూ చౌరాసియాపై దాడి: అస్పష్టంగా నిందితుడి ఆనవాలు.. -
పామును పట్టబోతే.. కాళ్లను చుట్టేసి పంచెలోకి దూరే..
గన్నేరువరం (మానకొండూర్): కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ఓ జెర్రిపోతు పాము ఓ వ్యక్తి పంచెలోకి దూరింది. గ్రామానికి చెందిన గడ్డమీది రాజయ్య పాములను పట్టడంలో నేర్పరి. గ్రామపంచాయతీ సమీపంలో అతనికి ఓ జెర్రిపోతు కనిపించడంతో దాని మూతిపై కర్రతో నొక్కి పట్టాడు. ఆ పాము తన తోకతో రాజయ్య కాళ్లను చుట్టేసి మెకాళ్లపైకి పాకుతూ.. పంచెలోకి దూరే ప్రయత్నం చేసింది. వెంటనే రాజయ్య దాని మూతి పట్టుకున్నాడు. గ్రామానికి చెందిన మాడుపు నర్సింహాచారి రాజయ్య కాళ్లను విడిపించాడు. అనంతరం రాజయ్య పామును కర్రతో కొట్టి హతమార్చాడు. ఘటన శుక్రవారం జరగగా.. శనివారం వివిధ మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. -
కరీంనగర్లో రోడ్డు ప్రమాదం
సాక్షి, కరీంనగర్: జిల్లాలోని మానకొండూరు మండలం ఖాదర్‌గూడెం శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు డీపీఎం వ్యాన్‌ను ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పెళ్లి బృందం హన్మకొండ నుంచి లక్షెట్టిపేటకు కారులో బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తిని పోలీసులు డేవిడ్‌గా గుర్తించారు. చదవండి: Himayat Nagar: బయటకు వస్తే చంపేస్తా..! -
సీఎం కేసీఆర్ చిన్ననాటి స్నేహితుడు మృతి
సాక్షి, మానకొండూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్ననాటి స్నేహితుడు, కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన తిరునగరి సంపత్‌కుమార్ గుండెపోటుతో బుధవారం రాత్రి కన్నుమూశారు. కేసీఆర్, సంపత్‌కుమార్ చదువుకునే రోజుల్లో మంచి మిత్రులని, ఒకే గదిలో ఉండేవారని గ్రామస్తులు తెలిపారు. సీఎం హోదాలో కేసీఆర్ కొన్ని నెలల క్రితం కరీంనగర్‌కు వచ్చినప్పుడు ఉత్తర తెలంగాణ భవన్లో ఉన్న కేసీఆర్‌ను కలిసేందుకు సంపత్‌కుమార్ వెళ్లారు. సంపత్‌కుమార్‌ను చూసి సీఎం చిరునవ్వుతో పలకరించి, ఆప్యాయతతో హత్తుకున్నారు. అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఆయన సంపత్‌ను పరిచయం చేశారు. హైదరాబాద్‌లో ఒకే గదిలో కలసి ఉన్న జ్ఞాపకాలను సీఎం గుర్తు చేయడంతో సంపత్‌కుమార్ ఆ రోజు సంతోషపడ్డారు. కాగా, సంపత్‌కుమార్ అవివాహితుడు కావడంతో ఆయన సోదరుడు అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: పోరాటయోధుడు గుమ్మి పుల్లన్న మృతి సింగరేణిలో ఉద్యోగాలు; హైకోర్టు కీలక ఆదేశాలు -
తండ్రి ప్రాణం తీసిన కోడికూర గొడవ
సాక్షి, మానకొండూర్ : కోడికూర వండి పెట్టాలని గొడవ పడిన తండ్రిని తనయుడు బండ రాయితో మోది చంపాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భీమదేవరపెల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సయ్యద్ మదార్ (40) రెండు నెలల క్రితం బండరాయి కొట్టేందుకు శంకరపట్నం మండలం కొత్తగట్టులో నివాసం ఉంటున్నాడు. మంగళవారం మద్యం సేవించి ఇంటికొచ్చిన మదార్.. కోడి కూర వండి పెట్టాలని కొడుకు ఖాసీంతో గొడవ పడ్డాడు. లేకుంటే చంపుతానని బెదిరించాడు. నిత్యం తాగి వస్తున్న తండ్రి వేధింపులు భరించలేక అతణ్ని హతమార్చాలని ఖాసీం నిర్ణయించాడు. మంగళవారం అర్ధరాత్రి మదార్ నిద్రిస్తున్న సమయంలో బండరాయితో మోది హత్య చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నీరుపెట్టిన వేగురుపల్లి
సాక్షి, మానకొండూర్(కరీంనగర్) : హైదరాబాద్‌లో ఓ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వెళ్లిన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు విగత జీవులుగా ఇంటికి వచ్చారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, నలుగురు గాయపడ్డారు. ఇంటికి చేరిన మృతదేహాలను చూసి ఊరంతా బోరున విలపించింది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వేన్షన్లో జరుగుతున్న ఓ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌కు సంతోషంగా వెళ్లిన వారు రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బోరున విలపించారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు మృతిచెందడం, నలుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామంలోని ముగ్గురు ప్రముఖులు ఒకే ప్రమాదంలో చనిపోవడంతో గ్రామస్తులు ఘోల్లుమన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వేన్షన్లో ఆదివారం ఓ సినిమాకు సంబంధించిన ఫ్రీ రీలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి మానకొండూర్ మండలం వేగురుపల్లికి చెందిన మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు కనుకుంట్ల మల్లేశం(47), టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఆర్ఎంపీ జంగ ప్రభాకర్‌రెడ్డి(50), వేగురుపల్లి గ్రామపంచాయతీ ఐదో వార్డుసభ్యుడు అలుగువెల్లి జనార్ధ్దన్‌రెడ్డి(40), టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నిట్టురు పుల్లయ్య(40), పెరుమాల్ల గోవర్ధన్(38), కోల శంకరయ్య(55), కారు డ్రైవర్ పబ్బతి దేవేందర్‌రెడ్డి(35)లు ఓకే గ్రామానికి చెందినవారు. కారు కిరాయికి మాట్లాడుకుని ఆదివారం ఉదయం హైదరాబాద్ వెళ్లారు. ఫంక్షన్ ముగిసిన అనంతరం కారులో అర్ధరాత్రి ఇంటికి వస్తుండగా సుమారు 12 గంటల సమయంలో ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనుకుంట్ల మల్లేశం, జంగ ప్రభాకర్‌రెడ్డి, అలుగువెల్లి జనార్ధన్‌రెడ్డి అక్కడిక్కడే మృతిచెందారు. గాయపడినవారిని స్థానికులు సికింద్రబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వేగురుపల్లికి తీసుకురావడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులరోదనలు మిన్నంటాయి. కుటుంబానికి పెద్ద దిక్కు.. అలువెల్లి జనార్థన్‌రెడ్డి మృతితో అతడి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయారు. మృతుడికి భార్య శైలజ, ఇంటర్ చదివే రుచిత, విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి.. కనుకుంట్ల మల్లేశం మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడిగా, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరి రాజకీయంగా ఎది గాడు. నాడు అతడి భార్య స్వరూప సర్పంచ్ ప దవి అలంకరించి అనారోగ్యంతో మృతిచెందగా నేడు కోడలు సంగీత సర్పంచ్. మృతుడికి కూతురు సౌమ్య, కుమారుడు అభిలాష్, రెండో భార్య బుజ్జమ్మ ఉన్నారు. సీనియర్ నాయకుడిగా.. మృతిచెందిన జంగ ప్రభాకర్‌రెడ్డి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్నాడు. ఇతడు మంత్రి ఈటలకు బంధువు, అత్యంత సన్నిహితుడు. మృతుడి భార్య వనజ ఉంది. ఇద్దకు కుమారులు కాగా ఒకరు వైద్య వృత్తిలో, మరొకరు సాప్ట్వేర్ ఇంజనీరుగా రాణిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి ఆర్ఎంపీగా కొనసాగుతున్నారు. మంత్రుల పరామర్శ ప్రజ్ఞపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వేగురుపల్లికి చెందిన ముగ్గురు మృతిచెందగా, బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజందర్ మృతదేహాలకు నివాళులు అర్పించి బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. జెడ్పీ చైర్ పర్సన్ విజయ, స్థానిక ఎమ్మెల్యే రసమయి, ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సుడా చైర్మన్ జీవీ రామక్రిష్ణారావు తదితరులు నివాళులర్పించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి దిగ్భ్రాంతి.. వేగురుపల్లి గ్రామస్తులు ముగ్గురు మృతి చెందడంపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్ సానుభూతి వ్యక్తం చేశారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. నివాళులర్పిస్తున్న మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, తదితరులు -
మొలంగూర్‌లో ఎలుగుబంటి హల్చల్
సాక్షి, మానకొండూర్ : శంకరపట్నం మండలం మొలంగూర్‌లో ఓ ఎలుగుబంటి చెట్టు ఎక్కి హల్చల్ చేసింది. చెట్టు ఎక్కిన ఎలుగుబంటిని మంగళవారం తెల్లవారుజామున గ్రామస్తులు గుర్తించి కేశవపట్నం పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది, అటవీశాఖ రేంజర్ ముంతాజ్‌అలీ, సెక్షన్ ఆఫీసర్లు సరిత, సురేందర్, బీట్ ఆఫీసర్లు లావణ్య, అనంతరాములు, రెస్క్యూ టీం పశువైద్యాధికారి ప్రవీణ్‌కుమార్ మొలంగూర్ చేరుకున్నారు. ఎలుగుబంటిని చెట్టుపై నుంచి కిందకు దించేందుకు ప్రయత్నించారు. పశువైద్యాధికారి దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి చెట్టు కింద వల ఏర్పాటు చేసి, ఆరు గంటలు శ్రమించి, వలలో బంధించారు. అయినా ఆ ఎలుగుబంటి వల నుంచి తప్పించుకొని, సమీపంలోని గుట్టవైపు పరుగు తీసింది. అటవీశాఖ అధికారులు దాన్ని పట్టుకొని మరోసారి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. అనంతరం అటవీశాఖ వాహనంలో తాడ్వాయి ఫారెస్ట్‌లో వదిలిపెట్టేందుకు తీసుకెళ్లారు. -
బాలుడ్ని తప్పించబోయారు కానీ అంతలోనే..
సాక్షి, మానకొండూర్ : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో సోమవారం కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న కారు గుండ్లపల్లి మూలమలుపు వద్ద సైకిల్‌పై వెళ్తున్న ఓ బాలుడ్ని తప్పించబోయి అదుపుతప్పింది. బాలుడ్ని.. రోడ్డు పక్కనే ఉన్న ఓ రాజకీయపార్టీ జెండాగద్దెను ఢీకొట్టి సమీపంలోని కిరాణాషాపులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో బాలుడి కాలు విరిగింది. కారులో ఏడుగురు ఉండగా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు.. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదా వరిఖనికి చెందిన నర్సింగ్‌భూషణ్ అతడి తండ్రి వెంకటాచారి, తల్లి సరోజ, భార్య స్వరూప, కుమారుడు సంచీద్రచారీ, మామ ఉప్పుల రామబ్రహ్మం, అత్త విజయలతో హైదరాబాద్‌లోని ఓ శుభకార్యానికి కారులో వెళ్లారు. సోమవారం వేకువజామున తిరుగుపయనమయ్యారు. ఉదయం ఏడుగంటలకు గుండ్లపల్లికి చేరుకున్నారు. రాజీవ్ రహదారి పక్కన స్టేజీ మూలమలుపు వద్ద సైకిల్‌పై కారీలు విక్రయించే సుబ్‌ఖాన్‌ను తప్పించబోయి కారు అదుపుతప్పి బాలుడితో పాటు ఓ రాజకీయపార్టీ జెండా గద్దెను ఢీకొట్టింది. కారువేగంగా ఉండటంతో పక్కనే ఉన్న కిరాణషాపులోకి దూసుకెళ్లింది. బాలుడు సుబ్‌ఖాన్ కాలు విరిగింది. కారులోని నర్సింగ్‌భూషణ్‌తో పాటు భార్య స్వరూప, ఆత్త విజయలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతావారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు, టోల్‌ప్లాజా సిబ్బంది, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన కారును కిందకు దించారు. క్షత్రగాతులను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కిరాణాషాపు పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో షాపు తెరవకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. షాపు నిర్వాహకుడు పబ్బతి ఆంజనేయులు ఫిర్యాదుతో ఎస్సై వంశీకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాంగ్రెస్‌కు షాక్.. కారెక్కిన మాజీ ఎమ్మెల్యే
సాక్షి, కరీంనగర్: లోక్‌సభ ఎన్నికల ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టిషాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం కరీంనగర్లో పూరించనున్న విషయం తెలిసిందే. స్థానిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో సాయంత్రం 6 గంటలకు ఈ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో కీలక నేతలను ఆకర్షింకుచేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రంగంలోకి దింపారు. రెండు రోజుల కిందటే టీఆర్ఎస్ స్థానిక నేతలతో చర్చించిన మోహన్.. ఆదివారం కేటీఆర్‌తో సమావేశమై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ముందు సీనియర్ నేత పార్టీని వీడడం.. కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎస్సీ రిజర్వ్ స్థానమైన మానకొండూర్ నుంచి 2009లో అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన రెండుసార్లు ప్రత్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతిలో ఓటమి చెందారు. -
పంచాయితీలు కార్పోరేషన్లో విలీనం
సాక్షి, అల్గునూర్: కరీంనగర్ కార్పొరేషన్ సమీపంలోని 8 గ్రామాల్లో పంచాయతీ శకం ముగిసింది. గురువారం నుంచి కార్పొరేషన్ పాలన మొదలైంది. ఇక ఆ పంచాయతీల్లో అన్నిసేవలు, పనులు కరీంనగర్ కార్పొరేషన్ నుంచే అందనున్నాయి. దీనిపై కొందరు విముఖత వ్యక్తం చేసిన కోర్టు తీర్పుతో తిమ్మాపూర్ మండలంలోపాటు 8 పంచాయతీలు కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం పూర్తయింది. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధి పెరగడంతోపాటు సేవలు విస్తృతం కానున్నాయి. విలీన పంచాయతీలో కరీంనరగ్ నగరపాలక సంస్థలో విలీనం అయ్యాయి. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రభుత్వం విలీనంపై స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసింది. దీంతో నగరపాలక సంస్థ అధికారులు విలీన పంచాయతీల్లోని రికార్డులను గురువారం స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్, తిమ్మాపూర్, కొత్తపల్లి, మానకొండూర్ మండలాల్లోని 8 పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేశారు. పంచాయతీ పేరిట ఉన్న బోర్డులను తొలగించి కార్పొరేషన్ బోర్డులు ఏర్పాటుచేశారు. హైకోర్టు తీర్పుతో ముగిసిన ప్రక్రియ.. తెలంగాణ ప్రభుత్వం స్థానిక ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా తమ గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీచేసిందని, 8 గ్రామాల ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు విలీనంపై కొంతకాలం స్టే విధించింది. విలీన ప్రక్రియపై ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని ఈనెల 8న స్పనష్టం చేసింది. వ్యతిరేకిస్తూ దాఖలైన పిలిషన్లను కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును అనుసరించి విలీన గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేయడాలని మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేయడంతో కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ వెంటనే విలీనం ప్రక్రియ పూర్తి చేశారు. రికార్డులు స్వాధీనం.. ప్రభుత్వం నుంచి అందిన ఉత్తర్వుల ప్రకారం కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు 8 పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి పంచాయతీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ భవనాలకు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కార్యాలయాలని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పాలన ప్రారంభం.. తిమ్మాపూర్ మండలం అల్గునూర్, మానకొండూర్ మండలం సదాశివపేటతోపాటు మిగతా ఆరు గ్రామాల్లో కరీంనగర్ నగరపాలక సంస్థ పాలన గురువారం నుంచి ప్రారంభమైంది. ఇక నుంచి ఈ ఎనిమది గ్రామాలు పంచాయతీలుగా కారకుండా నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతాలుగానే పరిగణిస్తారు. విలీన ప్రక్రియ ముగియడంతో కార్పొరేషన్ పాలన మొదలైంది. పన్నులు పెరగవు.. గతంలో ఉన్న విధంగానే విలీన గ్రామాల్లో పన్నులు వసూలు చేసి ఆయా విలీన గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతుందని అల్గునూర్ ప్రత్యేక అధికారి వందనం తెలిపారు. పన్నుల వసూలు బాధ్యతను బిల్ కలెక్టర్లు చూస్తారని పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే డీపీఎంఎస్‌కు నివేదిక అందించామన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్‌ను డీసీఎంఏకు రాసి ఆన్లైన్ విధానంలోనే పన్నులు తీసుకుంటామని వివరించారు. ఈ విషయాల్లో అపోహలు నమ్మొద్దని సూచించారు. ఏమైనా అనుమానాలు ఉంటే కరీంనగర్ నగరపాలక సంస్థలో సంప్రదించాలని సూచించారు. కార్పొరేషన్‌లోని వార్డులతో సమానంగా, విలీన గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. -
‘రాహుల్ కన్నుకొట్టే నాయకుడు’
సాక్షి, కరీంనగర్ : ప్రజాకూటమి నేతల్లో ఒకరిపై మరొకరికి నమ్మకం లేదని ఆపధర్మ మంత్రి హరీష్ వ్యాఖ్యానించారు. కోడందరాంపై కాంగ్రెస్‌కి, చాడ వెంకట్ రెడ్డిపై ఉత్తమ్ కుమార్‌కి నమ్మకం లేదని ఆయన అన్నారు. కంటి వెలుగులు అందించే నాయకుడు కేసీఆర్ అని.. కన్నుకొట్టే నాయకుడు రాహుల్ గాంధీ అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజవర్గంలోని శంకరపట్నంలో మంత్రి ఈటెల రాజేందర్, ఆ నియోజకవర్గ అభ్యర్థి రసమయి బాలకిషన్‌తో కలిసి హరీష్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే హుజురాబాద్, సిద్దిపేటలా మానకొండూర్‌ను కూడా అభివృద్ది చేస్తామని ప్రకటించారు. రోడ్ షోలో ఆయన ప్రసంగిస్తూ.. ‘‘ప్రజాకూటమిలో పొత్తుపెట్టుకుని కూడా ఎవరికి వారే అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ని నమ్మెదు. ఉద్యమకారుడైన కోదండరాంను కాంగ్రెస్ మోసం చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో తప్పించుకుని తిరిగిన నాయకులు కాంగ్రెస్ వాళ్లు. మిడ్ మానేర్ పూర్తయితే 50వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈ నియోజకవర్గ అభివృద్దిలో నేనూ, ఈటెల పాలుపంచుకుంటాము. ఏడాదిలోపల కాళేశ్వరం పూర్తి అవుతుంది. మిడ్‌మానేర్, కాళేశ్వరం కలిపితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా సస్యశ్యామలవుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్న ఏకైక నాయకుడు కేసీఆర్’’ అని హరీష్ వ్యాఖ్యానించారు. -
రసమయికి మరోసారి చేదు అనుభవం
-
రసమయికి మరోసారి చేదు అనుభవం
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్ నాయకుడు, మానకొండూర్ తాజా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కంది కట్కూర్ గ్రామంలో రసమయి ఆదివారం ప్రచారం నిర్వహిస్తుండా గ్రామస్తులు ఆయన్ను అడ్డుకున్నారు. గత నాలుగేళ్లలో తమకేం చేశారంటూ ఆయనను నిలదీశారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ మహిళలు రసమయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు మహిళలపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇరువర్గాల ఘర్షణకు దిగడంతో కంది కట్కూర్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గతంలో కూడా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రసమయికి ఇదే రకమైన అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. -
పాట గెలిపిస్తుందా.. జనం ఓడిస్తారా?
సాక్షి, కరీంనగర్ : ఎంకిపెళ్లి సుబ్బి సావుకొచ్చినట్లుంది మానకొండూర్ తాజా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిస్థితి. ముంచుకొస్తున్న ముందస్తు ఎన్నికల ప్రచారంలో రసమయి తీవ్ర నిరసనలకు గురువుతున్నారు. కాలుకు గజ్జెగట్టి ఆటపాటలతో ఉద్యమ సమయంలో జనాన్ని ఉర్రూతలూగించిన రసమయికి ఎన్నికల సమయంలో అదే జనం నుంచి నిరసన జ్వాలలు ఎదురుకావడంతో గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. కళాకారుడిగా జనం మెప్పుపొందిన రసమయి, ప్రజాప్రతినిధిగా జనం అభిమానాన్ని మాత్రం చురగొనలేకపొతున్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ‘గోబ్యాక్ రసమయి’ అనే ప్లేకార్డులే దర్శనమిస్తున్నాయి. ఇటీవల బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఇల్లంతుకుంట మండలంలో పర్యటించిన అతనికి గ్రామస్తుల నుంచి ఊహించని వ్యతిరేకత ఎదురైంది. సొంత పార్టీకి చెందిన మహిళలే త్రాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి వ్యతిరేక పార్టీకి చెందిన వారి నుంచి ఎదుర్కొవాల్సి ఉంటుంది. కానీ రసమయి మాత్రం సొంత పార్టీ కార్యకర్యల నుంచి తీవ్ర నిరసనలు చవిచూడాల్సి వస్తోంది. దళితులకు మూడెకరాల భూమి విషయంలో ఇటీవల బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన ఇద్దరు దళితులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరేపల్లి మోహాన్ ఎమ్మెల్యే తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నాలుగున్నరేళ్లు పదవిలో ఉండి నియోజకవర్గానికి కనీసం త్రాగునీరు కూడా అందించలేకపోయారని మండిపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థి ఆరేపల్లి మోహన్‌పై 46 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. స్వరాష్ట్రంలో తొలి తెలంగాణ సాంస్కృతిక సారధిగా నియమితులైయ్యారు. ఉద్యమ నాయకుడు కావడంతో గత ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించిన రసమయి.. ఈసారి గెలవడం అంత సులువైన విషయం కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా తనను విమర్శించిన ఎంతటివారిపైనైనా నోరుపారేసునే తత్వం రసమయిది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరుఫున బరిలో నిలిచిన ఆరేపల్లి మోహన్ మళ్లీ టిక్కెట్ తనకే తక్కుందని ధీమాతో ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ప్రత్యర్థి ఆరేపల్లి మోహన్ స్థానికుడు కావడం, రసమయి స్థానికేతరుడు కావడంతోపాటు ముక్కుసూటిగా మాట్లాడడంతోనే ముప్పువస్తుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు మారుతుండటంతో నియోజకవర్గాన్ని జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. మున్ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని చర్చించుకుంటున్నారు.