
సాక్షి, మానకొండూర్ : కరీంనగర్‌జిల్లా మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని పీడీ వెంకటేశ్వరరావును గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఘెరావ్ చేశారు.