
గన్నేరువరం (మానకొండూర్): కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ఓ జెర్రిపోతు పాము ఓ వ్యక్తి పంచెలోకి దూరింది. గ్రామానికి చెందిన గడ్డమీది రాజయ్య పాములను పట్టడంలో నేర్పరి. గ్రామపంచాయతీ సమీపంలో అతనికి ఓ జెర్రిపోతు కనిపించడంతో దాని మూతిపై కర్రతో నొక్కి పట్టాడు. ఆ పాము తన తోకతో రాజయ్య కాళ్లను చుట్టేసి మెకాళ్లపైకి పాకుతూ.. పంచెలోకి దూరే ప్రయత్నం చేసింది. వెంటనే రాజయ్య దాని మూతి పట్టుకున్నాడు. గ్రామానికి చెందిన మాడుపు నర్సింహాచారి రాజయ్య కాళ్లను విడిపించాడు. అనంతరం రాజయ్య పామును కర్రతో కొట్టి హతమార్చాడు. ఘటన శుక్రవారం జరగగా.. శనివారం వివిధ మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment