పెట్రోల్ బంక్‌పై పిడుగు
Published Tue, Apr 5 2016 7:27 PM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
మానకొండూరు (కరీంనగర్ జిల్లా) : మానకొండూరు మండలం గట్టుదిద్దెనపల్లిలోని పెట్రోల్ బంక్‌పై మంగళవారం మధ్యాహ్నం పిడుగుపడి మంటలు లేచాయి. విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పెట్రోల్ బంక్‌లోని గదిపై పడడంతో విద్యుత్ మీటర్ వద్ద మంటలు లేచాయి. బంకులోని సిబ్బంది వెంటనే అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్టు బంక్ సిబ్బంది చెబుతున్నారు.
అలాగే సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో ఉదయలక్ష్మి ఇండస్ట్రీస్ అనే రైస్ మిల్లు రేకులు గాలికి ఎగిరిపోవడంతో వర్షం తాకిడికి యంత్రాలు తడిసిపోయాయి. మోటార్లు కాలిపోయాయి. సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. అలాగే మండల కేంద్రంలో ఓ ట్రాన్స్‌ఫారమ్ పేలిపోయింది.
Advertisement
Advertisement