మానకొండూరు : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో ఓ రైతు అప్పుల బాధతో శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన కత్తెర్ల రాజయ్య సాగు కోసం దాదాపు రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. అవి తీర్చలేనన్న ఆవేదనతో ఇంటి దగ్గర పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.