కుటుంబ కలహాలతో మాటా మాటా పెరిగి భార్యాభర్తలు గొడవపడుతున్న సమయంలో కోపోద్రిక్తుడైన భర్త భార్యను గొంతు నులిమి చంపేశాడు.
మానకొండూరు (కరీంనగర్) : కుటుంబ కలహాలతో మాటా మాటా పెరిగి భార్యాభర్తలు గొడవపడుతున్న సమయంలో కోపోద్రిక్తుడైన భర్త భార్యను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి నా భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లిందని ఫిర్యాదు చేశాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎమ్‌డీ కాలనీలో శుక్రవారం సాయంత్రం జరిగింది. కాలనీకి చెందిన సాజిద్(39) అటెండర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య రిజ్వానా(35), నలుగురు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదంలో సాజిద్ తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.