మానకొండూరు (కరీంనగర్ జిల్లా) : మానకొండూరులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. చెరువుకట్టపై ఉన్న ప్రజలపై అకస్మాత్తుగా పిడుగుపడింది. ఈ ఘటనలో గాయపడినవారిని 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మృతులు శంకరపట్నానికి చెందిన కవిత, సదాశివపల్లికి చెందిన లక్ష్మి(50)గా గుర్తించారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.