కన్నకొడుకే గొడ్డలితో దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు.
రామన్నపేట (నల్లగొండ) : కన్నకొడుకే గొడ్డలితో దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలెంనగర్‌లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సయ్యద్ జమాల్ (65) రెండో కుమారుడు సయ్యద్ మక్సూద్ మద్యానికి బానిసయ్యాడు.
ఈ క్రమంలో శనివారం ఉదయం మక్సూద్ మద్యం మత్తులో తండ్రి జమాల్‌పై గొడ్డలితో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. జమాల్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.