ramannapet
-
యాదాద్రి: రామన్నపేట సీఐ, ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు
-
పాడి ప్రోత్సాహకం వచ్చేదెన్నడు?
సాక్షి, హైదరాబాద్: పై ఫొటోలో కన్పిస్తోన్న పాడి రైతు పేరు పర్నె నర్సిరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం. ఇతనికి రెండు గేదెలు, ఒక ఆవు ఉన్నాయి. గేదెల లో ఒకదానిని ప్రభుత్వం ఇచ్చిన 50% రాయితీతో కొనుగోలు చేశాడు. వీటి పోషణ కోసం తన పొలంలో లభించే ఎండుగడ్డి, పచ్చిగడ్డి, తవుడుతోపాటు నెలకు ఒక బస్తా పచ్చిచెక్క (రూ.1800), అరబస్తా కొబ్బరిపిట్టు (రూ. 2100), బస్తా దాణా (రూ.710) అవసరమవుతుంది. తన వద్ద ఉన్న పాడి సంపదతో రోజుకు సరాసరి 10 లీటర్ల పాలను గ్రామంలోనే ఉన్న సెంటర్‌కు పోస్తాడు. నెలకు 300 లీటర్ల చొప్పున 18 నెలలకు సంబంధించి 5,400 లీటర్లకు గాను రూ.21,600 ఈ రైతుకు ప్రోత్సాహకంగా రావాల్సి ఉంది. ఆ డబ్బులు వస్తే తన వద్ద ఉన్న గేదెలు, ఆవుకు కావాల్సిన దాణా కొనుగోలుకు వెసులుబాటు కలుగుతుందనే అభిప్రాయం ఆ రైతుది. కానీ, 18 నెలలు గా ఆ రైతుకు నిరీక్షణే మిగులుతోంది. ఇదే వెల్లంకి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘంలో 120 మంది రైతులున్నారు. ఈ కేంద్రం ద్వారా ఆవు, గేదె పాలు కలిపి రోజుకు 350 లీటర్ల పాలు సేకరిస్తారు. వీటిని మదర్ డెయిరీకి పంపుతారు. ఈ సంఘానికి 2018 ఏప్రిల్ వరకు ప్రభుత్వం ప్రకటించిన లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకం వచ్చింది. ఆ తర్వాత నిలిచిపోయింది. మే 2018 నుంచి అక్టోబర్ 2019 వరకు 1.83 లక్షల లీటర్ల పాలను ఈ సంఘం సభ్యులు సేకరించారు. వీటికి గాను రూ.7.32 లక్షలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా రావా ల్సి ఉంది. ఈ మొత్తం వస్తే పాడి రైతుకు ఊరట లభించనుంది. ఈ సమస్య ఒక్క పర్నె నర్సిరెడ్డి, వెల్లంకి పాల ఉత్పత్తిదారుల సంఘానిదే కాదు..రాష్ట్రంలోని 3 లక్షల మంది పాడిరైతులు ఈ ప్రోత్సాహకం కోసమే ఎదురుచూస్తున్నారు. 18 నెలలుగా రూ.120 కోట్లకు పైగా రావాల్సిన ప్రోత్సాహక బకాయిలు ఎప్పుడొస్తాయా అని నిరీక్షిస్తున్నారు. అసలీ ప్రోత్సాహకం ఎందుకు? విజయ డెయిరీ, ముల్కనూరు డెయిరీ, రంగారెడ్డి–నల్లగొండ డెయిరీ, కరీంనగర్ డెయిరీల పరిధిలోని పాడి రైతులకు, పాల సంఘాల సభ్యులకు లీటరుకు రూ.4 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస్తోంది. ఈ ప్రోత్సా హకం వల్ల పాడి రైతులు ఆయా డెయిరీలకే పాలు పోస్తారన్న భావనతో ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. మొదట్లో కేవలం విజయ డెయిరీకే పరిమితమైన ఈ పథకం, రెండేళ్ల నుంచి మిగిలిన మూడు డెయిరీలకూ వర్తింపజేసింది. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో 2018 మే నుంచి ప్రోత్సాహకం చెల్లింపులు జరగడం లేదు. ఈ ప్రోత్సాహక బకాయిలు వస్తే పశువుల దాణాకు, ఇతర కుటుంబ ఖర్చులకు అవసరం అవుతాయని పాడి రైతులు చెబుతున్నారు. సగటున ఒక్కో రైతుకు కనీసం రూ. ఐదారువేలు వస్తే ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుందని, ప్రభుత్వ డెయిరీలకే పాలు పోయాలన్న భావన మెరుగవుతుందంటున్నారు. ప్రభుత్వం ఏం చేస్తోంది? నిధుల లేమితోనే ప్రభుత్వం ఈ ప్రోత్సాహక నిధులు ఇవ్వడం లేదని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నిధుల విడుదల కోసం ప్రయత్నాలు ప్రారంభించామని, ప్రభుత్వం కూడా ఈ నిధుల విడుదలకు అనుమతినిచ్చిందని నేడో, రేపో ప్రస్తుతమున్న బకాయిల్లో 40% డబ్బులు వచ్చే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. గతేడాది డిసెంబర్ వరకు ఉన్న బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. 2018 ఏప్రిల్ నెలలో చివరిసారి ప్రోత్సాహకం చెల్లించగా, అప్పటికే బకాయి ఉన్న నాలుగు నెలల ప్రోత్సాహకాలు ఒకేసారి ఇచ్చారని, అప్పుడు కూడా రావాల్సిన మొత్తంలో కొంతమాత్రమే ఇచ్చారని పాడి రైతులంటున్నారు. 2018 జనవరి–ఏప్రిల్ వరకు ఒక్కో రైతుకు రావాల్సిన దాంట్లో ఇంకా పెండింగ్ ఉందని, ఇప్పుడు మళ్లీ 18 నెలల బకాయిలున్నాయని, వీలున్నంత ఎక్కువ నిధులు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి ప్రభుత్వం పాల ప్రోత్సాహకాన్ని ఏం చేస్తుందో... ఎన్ని నిధులిస్తుందో నేడో, రేపో తేలనుంది. -
అమ్మాయి చేతిలో ఓడిపోయానని..
సాక్షి, యాదాద్రి: జిల్లాలోని రామన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ ఎలక్షన్లో ఓడిపోయాననే మనస్థాపంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి రైలు కింద పడి చనిపోయాడు. వివరాలు.. సాయి చరణ్ అనే విద్యార్థి రామన్నపేట పట్టణంలోని కృష్ణవేణి పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం పాఠశాలలో క్లాస్ లీడర్ ఎన్నికలు జరిగాయి. సాయి చరణ్ పోటీలో నిలిచాడు. అయితే ఈ ఎన్నికల్లో సాయి చరణ్‌తో పాటు నిల్చున్న మరో బాలికను క్లాస్ లీడర్‌గా ఎన్నుకున్నారు విద్యార్థులు. తోటి అమ్మాయి చేతిలో ఓడిపోవడంతో తీవ్ర మనస్థాపినికి గురైన సాయి కిరణ్ నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి పోయి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. -
కన్నతల్లిని హత్య చేసిన కొడుకు
జల్సాలకు డబ్బివ్వలేదని అఘాయిత్యం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం బోయినపల్లి : జల్సాలకు డబ్బులు ఇవ్వడం లేదని కన్నతల్లిని హత్యచేశాడో కొడుకు. గొంతునులిమి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఈ సంఘటన మండలంలోని రామన్నపేటలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముస్కు లత, రాజిరెడ్డి దంపతులకు విక్రంరెడ్డి, శ్రీవిద్య సంతానం. రాజిరెడ్డి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. విక్రంరెడ్డి హైదరాబాద్‌లో ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. శ్రీవిద్య తన అమ్మమ్మ ఇల్లైన వేములవాడ మండలం చెక్కపల్లి వద్ద ఉంటోంది. విక్రంరెడ్డి తరచూ స్వగ్రామానికి వచ్చి డబ్బులు కావాలని తల్లిని వేధించేవాడు. కొద్దిరోజుల క్రితం రామన్నపేటకు చేరిన ఆయన.. తల్లిని డబ్బుల కోసం వేధిస్తున్నాడు. దీనికి ఆమె అంగీకరించలేదు. ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తల్లిపై కక్ష పెంచుకున్న విక్రంరెడ్డి ఆదివారం రాత్రి లత (38)ను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తలుపులు వేసి వెళ్లిపోయాడు. రెండురోజులుగా లత బయటకు రాకపోయేసరికి స్థానికులు తలుపు తెరిచి చూడగా శవమై పడి ఉంది. విషయాన్ని వెంటనే విక్రంరెడ్డికి ఫోన్‌ద్వారా చేరవేశారు. ఏమీ ఎరగనట్లు ఇంటికి చేరుకుని తల్లి శవం వద్ద రోదిస్తూ ఉండిపోయాడు. లత శరీరం ఉబ్బి ఉండడం.. పక్కన క్రిమిసంహారక మందు డబ్బా ఉండడంతో అందరూ ఆత్మహత్యగా అనుమానించారు. మంగళవారం ఉదయం సంఘటనస్థలానికి చేరుకున్న ఎన్ఐబీ సీఐ సర్వర్, చందుర్తి ఎస్సై కిరణ్‌కుమార్ విక్రంరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా తానే చంపినట్లు వెల్లడించాడు. భార్య హత్య విషయం తెలుసుకున్న రాజిరెడ్డి దుబాయి నుంచి వచ్చాడు. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో రాజిరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్సై కోట సతీశ్ తెలిపారు. -
తండ్రిపై హత్యాయత్నం
రామన్నపేట (నల్లగొండ) : కన్నకొడుకే గొడ్డలితో దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలెంనగర్లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సయ్యద్ జమాల్ (65) రెండో కుమారుడు సయ్యద్ మక్సూద్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం మక్సూద్ మద్యం మత్తులో తండ్రి జమాల్‌పై గొడ్డలితో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. జమాల్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య
లచ్చిరెడ్డిగూడెం (రామన్నపేట) : వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం నల్గొండ జిల్లా దుబ్బాక గ్రామపంచాయతీ పరిధిలోని లచ్చిరెడ్డిగూడెం గ్రామంలో జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పైళ్ల యాదిరెడ్డి అనే రైతు ఇస్కిళ్లగ్రామ శివారులో తనకున్న పొలంతోపాటు, మరికొంత భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఆరు ఎకరాలలో వరిని, మరో ఆరు ఎకరాలలో పత్తిని సాగుచేశాడు. భూగర్భజలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి. వరిపైరు ఎండకుండా ఉండేందుకు ఇటీవలే రెండుబోర్లు వేయగా నీళ్లుపడలేదు. దీంతో రెండున్నర ఎకరాల వరిచేను ఎండిపోయింది. వర్షాభావ పరిస్థితుల వల్ల పత్తి చేను సైతం బాగా దెబ్బతిన్నది. వ్యవసాయంకోసం చేసిన అప్పుల భారం బాగా పెరిగిపోయింది. అప్పులు తీర్చలేనేమో అని మనస్థాపం చెందిన యాదిరెడ్డి మంగళవారం ఉదయం వ్యవసాయబావి వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఉదయం 8గంటల సమయంలో యాదిరెడ్డి భార్య ఆండాలు భర్తకు భోజనం తీసుకొని బావి వద్దకు వెళ్లగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ జి.రాజశేఖర్ తెలిపారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
రామన్నపేట : అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన వీరమల్ల నర్సింహా(42) తన 4 ఎకరాల పొలంతో పాటు మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. అయితే జిల్లాలో ఏర్పడిన తీవ్ర వర్షాబావ పరిస్థితుల నేపథ్యంలో సాగుచేసిన పత్తి పంట సరిగా ఎదగలేదు. పత్తిపంట సాగు కోసం రూ. 2లక్షల అప్పు కూడా చేశాడు. దీంతో సాగు చేసిన పంట చేతికి అంది వచ్చే అవకాశం లేకపోవడం.. కళ్ల ముందు అప్పుతీర్చే మార్గం కనిపించకపోవడంతో గురువారం రాత్రి పొలం దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య బంధువులతో కలిసి పొలం దగ్గరకు వెళ్లగా నర్సింహా విగతజీవిగా కనిపించాడు. విషయం తెలిసిన పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కౌలు రైతు ప్రాణం తీసిన కరువు
రామన్నపేట : కౌలు చెల్లింపుతోపాటు పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేనేమోననే బెంగతో ఓ రైతు ప్రాణం తీసుకున్నాడు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నిదానపల్లికి చెందిన కడారి మల్లేశం(30) గ్రామశివారులోఉన్న ఓ సీడ్స్ కంపెనీకి చెందిన 24 ఎకరాల భూమిని ఏడాదికి రూ.1.20 లక్షల వంతున చెల్లించే ఒప్పందానికి కౌలుకు తీసుకున్నాడు. ఆ భూమిలో వరి, పత్తి, మినుము సాగు చేశాడు. ఇందుకోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పు తీసుకుని, పెట్టుబడులు పెట్టాడు. వర్షాభావం కారణంగా బోర్లు ఎండిపోవటంతో పంటలు దెబ్బతిన్నాయి. మనస్థాపానికి గురైన మల్లేశం పురుగులమందు తాగాడు. నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మల్లేశానికి భార్య పద్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.