
సాక్షి, యాదాద్రి: జిల్లాలోని రామన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ ఎలక్షన్‌లో ఓడిపోయాననే మనస్థాపంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి రైలు కింద పడి చనిపోయాడు. వివరాలు.. సాయి చరణ్ అనే విద్యార్థి రామన్నపేట పట్టణంలోని కృష్ణవేణి పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం పాఠశాలలో క్లాస్ లీడర్ ఎన్నికలు జరిగాయి. సాయి చరణ్ పోటీలో నిలిచాడు.
అయితే ఈ ఎన్నికల్లో సాయి చరణ్‌తో పాటు నిల్చున్న మరో బాలికను క్లాస్ లీడర్‌గా ఎన్నుకున్నారు విద్యార్థులు. తోటి అమ్మాయి చేతిలో ఓడిపోవడంతో తీవ్ర మనస్థాపినికి గురైన సాయి కిరణ్ నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి పోయి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు.