
ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి శైనీ
సాక్షి, యాదాద్రి: జిల్లాలోని చౌటుప్పల్ మండలం రాంనగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఒక మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి ఉమారాణి(32) మొదట తన ముగ్గురు పిల్లలకు ఉరి వేయగా హర్షిణి(13), లక్కీ(11) మృతి చెందగా.. చిన్న కూతురు శైనీ(8) ప్రాణాలతో బయటపడింది. కాగా ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.