Choutuppal Mandal
-
‘థర్డ్‌వేవ్’ను దేశం తట్టుకోగలదు: సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్
సాక్షి, చౌటుప్పల్: కరోనా థర్డ్ వేవ్‌ను సమర్థంగా తట్టుకొనే శక్తి దేశానికి ఉందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి.మండే తెలిపారు. సెకండ్ వేవ్ సమయంలో సరైన జాగ్రత్తలు లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించిందని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం గ్రామంలోని భూ అయస్కాంత పరిశోధన క్షేత్రం (ఎన్జీఆర్ఐ)లో కొత్తగా ఏర్పాటు చేసిన జియో మ్యాగ్నటిక్ అబ్జర్వేటరీని శనివారం ఆయన ప్రారంభించారు. జియోమ్యాగ్నటిక్ అబ్జర్వేటరీ పనితీరును పరిశీలించారు. కార్యాలయంలో ఫొటో గ్యాలరీని తిలకించారు. అనంతరం విలేకరుల సమావేశంలో శేఖర్ మాట్లాడుతూ థర్డ్‌వేవ్ సంభవించినా అంతగా నష్టం ఉండదని అంచనా వేశారు. వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతుండడం, 60–65 శాతం మందిలో ఇప్పటికే యాంటీబాడీలు వృద్ధి చెందడంతో థర్డ్‌వేవ్ పెద్దగా ప్రభావం చూపదన్నారు. కరోనా వ్యాక్సినేషన్లో సీఎస్ఐఆర్ కీలకపాత్ర పోషించిందన్నారు. సీసీఎంబీతో కలసి సమన్వయంతో పనిచేసిందని, కోవాగ్జిన్ తయారీకి అవసరమైన తోడ్పాటును అందించామన్నారు. మొదటి, రెండోడోస్ టీకా వేసుకున్న వ్యక్తులకు మూడో డోస్(బూస్టర్) అవసరం వస్తుందా రాదా అన్న విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. కరోనా వైరస్ మానవ సృష్టా లేదా ప్రకృతి పరంగా వచ్చిందా అన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. ప్రకృతి విపత్తులపై అలర్ట్... జియో మ్యాగ్నటిక్ అబ్జర్వేటరీలు ప్రపంచ వ్యాప్తంగా 450 ఉండగా, వాటిలో 150 డిజిటల్ అబ్జర్వేటరీలు ఉన్నాయని సీఎస్ఐఆర్ డీజీ శేఖర్ సి. మండే తెలిపారు. అయితే మన దేశంలో 10 చోట్లే అబ్జర్వేటరీల ఏర్పాటు జరిగిందన్నారు. ఈ అబ్జర్వేటరీలో ప్రతి సెకనుకు సేకరించే నమూనాలు ఉపగ్రహం ద్వారా ప్రపంచంలోని అన్ని అబ్జర్వేటరీలతో అనుసంధానమై ఉంటాయన్నారు. దీంతో అన్ని అబ్జర్వేటరీల నుంచి వచ్చే సమాచారాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించడం ద్వారా భూ అయస్కాంత క్షేత్రాల మార్పును గుర్తించవచ్చన్నారు. భూకంపాలు, సౌర తుపానులు, సునామీలను ముందుగా గుర్తించి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అప్రమత్తం కావొచ్చన్నారు. భూగర్భంలో ఖనిజాలు, జలవనరులు, చమురు నిక్షేపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ అబ్జర్వేటరీ గుర్తిస్తుందని శేఖర్ మండే తెలిపారు. ఈ నూతన అబ్జర్వేటరీలో కెనడా, డెన్మార్క్ తయారు చేసిన అత్యాధునిక మ్యాగ్నో మీటర్లను అమర్చామన్నారు. విలేకరుల సమావేశంలో ఎన్జీఆర్ఐ డైరెక్టర్ వి.ఎం. తివారీ, సీనియర్ సైంటిస్టులు డాక్టర్ నందన్, డాక్టర్ దేవేందర్, డాక్టర్ శ్రీనాగేష్, అజయ్ మాంగీక్, కీర్తిశ్రీవాత్సవ, కుస్మిత అలోక తదితరులు పాల్గొన్నారు. -
ఏం కష్టమొచ్చిందో.. పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
సాక్షి, యాదాద్రి: జిల్లాలోని చౌటుప్పల్ మండలం రాంనగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఒక మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి ఉమారాణి(32) మొదట తన ముగ్గురు పిల్లలకు ఉరి వేయగా హర్షిణి(13), లక్కీ(11) మృతి చెందగా.. చిన్న కూతురు శైనీ(8) ప్రాణాలతో బయటపడింది. కాగా ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మాత్రలు వికటించి 10మంది విద్యార్థులకు అస్వస్థత
నల్గొండ: జిల్లాలోని చౌటుప్పల్ మండలం లక్కారంలో 10 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు తీసుకున్న పైలేరియా మాత్రలు వికటించడంతో తీవ్ర అస్వస్థతకు లోనైయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
వివాహానికి అడ్డొస్తుందనే..
చౌటుప్పల్ :చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం శివారులో ఈ నెల 4వ తేదీన వెలుగుచూసినమహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో వివాహానికి అడ్డొస్తుందనే కారణంతోనే ఈ దారుణం చోటు చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు విలేకరులకు హత్యకేసు వివరాలు వెల్లడించారు. నార్కట్‌ప ల్లి మండలం చిన్నతుమ్మలగూడెం గ్రామానికి చెందిన నల్ల నీలమ్మ(28)కు రామన్నపేట మం డలం కక్కిరేణికి చెందిన కిష్టయ్యతో 10ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈమెకు కుమారు డు, కుమార్తె ఉన్నారు. చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామానికి చెందిన గంగిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి(21) ఇంటర్ ఫెయిల్ అయి, వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది వరికోత యంత్రాన్ని కొనుగోలు చేశా డు. వరికోత యంత్రం డ్రైవర్‌గా ఈయనే పనిచేస్తున్నాడు. గత ఏడాది వరిచేలు కోసేం దుకు కక్కిరేణికి వెళ్లాడు. వరికోత మిషన్ వద్దకు నీలమ్మ కూలి పనికి వచ్చింది. అక్కడ నీలమ్మతో రాజశేఖర్‌రెడ్డికి పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. రాజశేఖర్‌రెడ్డికి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు పెళ్లిసంబంధాలు చూస్తున్నారు. ఈ విషయా న్ని రాజశేఖర్‌రెడ్డి నీలమ్మకు తెలిపాడు. నేనుం డగా, నీవు పెళ్లి ఎలా చేసుకుంటావని నీలమ్మ నిలదీసింది. దీంతో రాజశేఖర్‌రెడ్డి నీలమ్మను వదిలించుకోవాలని హత్యకు పథకం వేశాడు. నీలమ్మ పేరుతోనే సిమ్‌కార్డు తీసుకుని.. రాజశేఖర్‌రెడ్డి తన సెల్‌నంబర్ నుంచి నీలమ్మ తో నిత్యం సెల్ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో హత్య చేస్తే, సెల్‌ఫోన్ నంబరు ఆధారంగా పోలీసులకు దొరికి పోతామని, ఆమెకు మాయ మాటలు చెప్పి అడ్రస్ ప్రూఫ్ తీసుకున్నాడు. ఆ అడ్రస్ ప్రూఫ్‌తో నీల మ్మ పేరు మీద సిమ్‌కార్డు తీసుకున్నాడు. ఈ నంబరుతోనే మాట్లాడుతున్నాడు. దసరా పం డగకు రెండు రోజుల ముందుగానే నీలమ్మ, తల్లిగారి ఊరైన చిన్నతుమ్మలగూడేనికి వెళ్లింది. సద్దుల బతుకమ్మ రోజు, రాజశేఖర్‌రెడ్డి నీలమ్మ కు ఫోన్ చేసి పండగకు బట్టలు ఇప్పిస్తా, చౌటుప్పల్‌కు రమ్మని చెప్పాడు. దీంతో ఆమె ఈ నెల 2వ తేదీన రాత్రి పిల్లలను ఇంటి వద్దే వదిలి, చౌటుప్పల్‌కు వచ్చింది. రాజశేఖర్‌రెడ్డి ఆమెను చౌటుప్పల్ నుంచి బైకుపై ఎక్కించుకుని ఎస్.లింగోటం శివారులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. గొంతు నులిమి, బండరాయి తలపై ఎత్తేసి, హత్య చేశాడు. ఆమె ఒంటిపైనున్న బంగారు పుస్తె, చెవి కమ్మలు, పట్టాలను తీసుకుని పరారయ్యాడు. ఈ నెల 4వ తేదీన శవాన్ని గుర్తించిన పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 4, 5తేదీల్లో నీలమ్మ మృతదేహాన్ని ఆసుపత్రిలోనే భద్రపరిచారు. అప్పటికే శవం కుళ్లిపోయి, దుర్వాసన వస్తుండడంతో గ్రామపంచాయతీ సిబ్బందితో పూడ్చివేయించారు. కాగా, నీలమ్మ కనిపిం చ డం లేదని ఆమె కుటుంబ సభ్యులు ఈ నెల 7వ తేదీన నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. ఇక్కడ గుర్తు తెలియని శవం లభిం చడంతో, ఇక్కడికి వచ్చి, ఆమె వస్త్రాలను చూ సి, నీలమ్మగా గుర్తించారు. నీలమ్మ సెల్‌నంబరు తీసుకుని, పోలీ సులు దర్యాప్తు చేశా రు. రాజశేఖర్‌రెడ్డి నీలమ్మతో అప్పటి వరకు తన సెల్‌నంబరుతో మాట్లాడి, హత్యకు వారం రోజుల ముందు నుంచి కొత్త నంబరుతో పదేపదేమాట్లాడుతుండడంతో అనుమానం వచ్చి, అదుపులోకి తీసుకుని విచారించడంతో, హత్య కేసు మిస్టరీ వీడింది. అతడి వద్ద నుంచి సెల్ఫోన్లు, బంగారు ఆభరణాలు, మోటారుసైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. రామన్నపేట కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో ఎస్ఐలు హరిబాబు, మల్లీశ్వరి పాల్గొన్నారు.