వివాహానికి అడ్డొస్తుందనే.. | mystery murder case closed | Sakshi
Sakshi News home page

వివాహానికి అడ్డొస్తుందనే..

Published Fri, Oct 17 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

వివాహానికి అడ్డొస్తుందనే..

వివాహానికి అడ్డొస్తుందనే..

చౌటుప్పల్ :చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం శివారులో ఈ నెల 4వ తేదీన వెలుగుచూసినమహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో వివాహానికి అడ్డొస్తుందనే కారణంతోనే ఈ దారుణం చోటు చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం పోలీస్ ఇన్‌స్పెక్టర్ భూపతి గట్టుమల్లు విలేకరులకు హత్యకేసు వివరాలు వెల్లడించారు. నార్కట్‌ప ల్లి మండలం చిన్నతుమ్మలగూడెం గ్రామానికి చెందిన నల్ల నీలమ్మ(28)కు రామన్నపేట మం డలం కక్కిరేణికి చెందిన కిష్టయ్యతో 10ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈమెకు కుమారు డు, కుమార్తె ఉన్నారు. చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామానికి చెందిన గంగిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి(21) ఇంటర్ ఫెయిల్ అయి, వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది వరికోత యంత్రాన్ని కొనుగోలు చేశా డు. వరికోత యంత్రం డ్రైవర్‌గా ఈయనే పనిచేస్తున్నాడు. గత ఏడాది వరిచేలు కోసేం దుకు కక్కిరేణికి వెళ్లాడు. వరికోత మిషన్ వద్దకు నీలమ్మ కూలి పనికి వచ్చింది. అక్కడ నీలమ్మతో రాజశేఖర్‌రెడ్డికి పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. రాజశేఖర్‌రెడ్డికి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు పెళ్లిసంబంధాలు చూస్తున్నారు. ఈ విషయా న్ని రాజశేఖర్‌రెడ్డి నీలమ్మకు తెలిపాడు. నేనుం డగా, నీవు పెళ్లి ఎలా చేసుకుంటావని నీలమ్మ నిలదీసింది. దీంతో రాజశేఖర్‌రెడ్డి నీలమ్మను వదిలించుకోవాలని హత్యకు పథకం వేశాడు.
 
 నీలమ్మ పేరుతోనే సిమ్‌కార్డు తీసుకుని..
 రాజశేఖర్‌రెడ్డి తన సెల్‌నంబర్ నుంచి నీలమ్మ తో నిత్యం సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో హత్య చేస్తే, సెల్‌ఫోన్ నంబరు ఆధారంగా పోలీసులకు దొరికి పోతామని, ఆమెకు మాయ మాటలు చెప్పి అడ్రస్ ప్రూఫ్ తీసుకున్నాడు. ఆ అడ్రస్ ప్రూఫ్‌తో  నీల మ్మ పేరు మీద సిమ్‌కార్డు తీసుకున్నాడు. ఈ నంబరుతోనే మాట్లాడుతున్నాడు. దసరా పం డగకు రెండు రోజుల ముందుగానే నీలమ్మ, తల్లిగారి ఊరైన చిన్నతుమ్మలగూడేనికి వెళ్లింది. సద్దుల బతుకమ్మ రోజు, రాజశేఖర్‌రెడ్డి నీలమ్మ కు ఫోన్ చేసి పండగకు బట్టలు ఇప్పిస్తా, చౌటుప్పల్‌కు రమ్మని చెప్పాడు. దీంతో ఆమె ఈ నెల 2వ తేదీన రాత్రి పిల్లలను ఇంటి వద్దే వదిలి, చౌటుప్పల్‌కు వచ్చింది. రాజశేఖర్‌రెడ్డి ఆమెను చౌటుప్పల్ నుంచి బైకుపై ఎక్కించుకుని  ఎస్.లింగోటం శివారులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. గొంతు నులిమి, బండరాయి తలపై ఎత్తేసి, హత్య చేశాడు. ఆమె ఒంటిపైనున్న బంగారు పుస్తె, చెవి కమ్మలు, పట్టాలను తీసుకుని పరారయ్యాడు.
 
 ఈ నెల 4వ తేదీన శవాన్ని గుర్తించిన పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 4, 5తేదీల్లో నీలమ్మ మృతదేహాన్ని ఆసుపత్రిలోనే భద్రపరిచారు. అప్పటికే శవం కుళ్లిపోయి, దుర్వాసన వస్తుండడంతో గ్రామపంచాయతీ సిబ్బందితో పూడ్చివేయించారు. కాగా, నీలమ్మ కనిపిం చ డం లేదని ఆమె కుటుంబ సభ్యులు ఈ నెల 7వ తేదీన నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. ఇక్కడ గుర్తు తెలియని శవం లభిం చడంతో, ఇక్కడికి వచ్చి, ఆమె వస్త్రాలను చూ సి, నీలమ్మగా గుర్తించారు. నీలమ్మ సెల్‌నంబరు తీసుకుని, పోలీ సులు దర్యాప్తు చేశా రు. రాజశేఖర్‌రెడ్డి నీలమ్మతో అప్పటి వరకు తన సెల్‌నంబరుతో మాట్లాడి, హత్యకు వారం రోజుల ముందు నుంచి కొత్త నంబరుతో పదేపదేమాట్లాడుతుండడంతో అనుమానం వచ్చి, అదుపులోకి తీసుకుని విచారించడంతో, హత్య కేసు మిస్టరీ వీడింది. అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు, మోటారుసైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. రామన్నపేట కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో ఎస్‌ఐలు హరిబాబు, మల్లీశ్వరి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement