Mystery murder case
-
పట్టుకోండి చూద్దాం! మర్డర్ ఫర్ గెయిన్ కేసుల్లో వీడని మిస్టరీ
కదిరి: అంతుచిక్కని నేరాలకు కదిరి ప్రాంతం కేంద్రమవుతోందా? కేసుల దర్యాప్తులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా? మర్డర్ ఫర్ గెయిన్ కేసుల్లోని మిస్టరీ వీడేది ఎన్నడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. ‘పట్టుకోండి చూద్దాం’ అంటూ పోలీసులకు హంతకులు, దోపిడీ దొంగలు సవాల్ విసురుతున్నారు. వరుసగా చోటు చేసుకున్న మర్డర్ ఫర్ గెయిన్ ఘటనలను మరువక ముందే కదిరి వాసులను దోపిడీ దొంగలు బెంబేలెత్తిస్తున్నారు. పలు వీధుల్లో రాత్రిపూట అగంతకులు హల్చల్ చేస్తుండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతా పథకం ప్రకారమే.. గత నెల 16న ఎన్జీఓ కాలనీలో టీచర్ శంకర్‌రెడ్డి సతీమణి టీచర్ ఉషారాణి (47)ని అగంతకులు దారుణంగా హతమార్చి విలువైన బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకెళ్లారు. అదే సమయంలో ఉషారాణి ఇంటి పక్కనే ఉంటున్న టీస్టాల్ నిర్వాహకుడు రమణ ఇంటిలో చొరబడి ఆయన భార్య శివమ్మను సైతం తీవ్రంగా గాయపరిచారు. 20 రోజుల పాటు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె ఇటీవలే ఇంటికి చేరుకున్నారు. ఈ రెండు ఘటనల్లో దుండగులు పక్కా పథకం ప్రకారమే పని చక్కెబెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఘటన జరిగిన రోజుకు వారం రోజుల ముందు నుంచి ఎన్జీఓ కాలనీ సెల్‌టవర్ పరిధిలోని కాల్‌డేటాను పోలీసులు సేకరించి పరిశీలించారు. అపరిచిత నంబర్ల నుంచి ఎలాంటి కాల్స్ వెళ్లలేదని నిర్ధారించుకున్నారు. దుండగులు సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో కేసు దర్యాప్తు మిస్టరీగానే మిగిలిపోయింది. దర్యాప్తునకు ఏఎస్పీ స్థాయి అధికారి.. టీచర్ ఉషారాణి హత్యకేసును ఛేదించేందుకు ఏఎస్పీ రామకృష్ణప్రసాద్‌ను ప్రత్యేకంగా నియమించారు. అలాగే పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో కూడిన ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఉషారాణి హత్య కేసులో నిందితుల కోసం దాదాపు 50 మంది పోలీసులు జల్లెడ పడుతున్నారు. అయినా ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. ఎన్జీఓ కాలనీతో పాటు కదిరిలోని ప్రధాన రహదారుల్లోని సీసీ ఫుటేజీలను, చెక్‌పోస్టుల వద్ద వాహనాల కదలికలను పరిశీలించారు. అయినా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. మిస్టరీగా కిరణ్ హత్య.. కదిరిలోని ఎంజీ రోడ్డులో తాను అద్దెకుంటున్న గదిలో నిద్రిస్తున్న బంగారు ఆభరణాల తయారీదారు కిరణ్(23) ఈ ఏడాది సెపె్టంబర్ 12న హత్యకు గురయ్యాడు. ఇది జరిగి 3 నెలలకు పైగా అవుతున్నా హంతకులను పసిగట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈ కేసు విచారణలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్పటి పట్టణ సీఐగా ఉన్న కుచల శ్రీనివాసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే కేసులోని మిస్టరీ వీడలేదు. -
మాజీ క్రికెటర్ హత్య.. కొడుకే హంతకుడు
సాక్షి, తిరువనంతపురం: కేరళ మాజీ రంజీ క్రికెటర్ కె.జయమోహన్ తంపి(64) హత్య కేసు మిస్టరీ వీడింది. మద్యం మత్తులో ఆయన కుమారుడు అశ్వినే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు వెల్లడించారు. ఈ మాజీ క్రికెటర్ సోమవారం అనుమానస్పద స్థితిలో ఇంట్లో శవమై కనిపించిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ కేసులో మొదటి నుంచి ఆయన కొడుకు అశ్విన్‌పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకోని విచారించగా అసలు వ్యవహారం బయటపడింది. (ఆస్పత్రి నుంచి పారిపోయి.. శవమై తేలాడు) ‘జయంత్ ఆయన కుమారుడు అశ్విన్‌లు ప్రతిరోజు ఇంట్లోనే మద్యం తాగే అలవాటు ఉంది. జయమోహన్ హత్యకు గురైన రోజు(శనివారం) కూడా వారు మద్యం సేవించారు. మరింత మద్యం కోసం తండ్రి డెబిట్ కార్డును ఉపయోగించడానికి అశ్విన్ ప్రయత్నించాడు. అయితే దీనికి జయమోహన్ అంగీకరించలేదు. దీంతో వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్దగొడవకు దారితీసింది. ఈ క్రమంలో జయమోహన్‌ను అశ్విన్ బలంగా తోసేయడంతో కిందపడ్డాడు. తలకు తీవ్రగాయం అయింది. ఆ తర్వాత తండ్రి శవాన్ని పక్కకు పడేసి అక్కడే మరింత మద్యం సేవించి పడుకున్నాడు’ అని పోలీసులు తెలిపారు. ఇక జయమోహన్ 1979-82 సమయంలో కేరళ తరుపున 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. (మహిళ ప్రాణం తీసిన స్కార్ఫ్) -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
కాటారం : జిల్లాలో సంచలనం సృష్టించిన టీడీపీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు రామిళ్ల కవిత(35) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కాటారం మండలం కొత్తపల్లిలో ఈ నెల 11 అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రామిళ్ల కవితను దుండగులు అతికిరాతకంగా హత్య చేసిన విషయం విధితమే. కాగా కవిత హత్యకు అసలు కారణం వివాహేతర సంబ ంధమే అని పోలీసులు తేల్చారు. తన భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న కవితను పలుమా ర్లు హెచ్చరించినప్పటికీ వైఖరి మార్చుకోకపోవడంతో విరక్తి చెంది పథకం ప్రకారం ఓ భార్య కాంట్రాక్ట్ మర్డర్ చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేఆర్కే ప్రసాద్‌రావు, సీఐ చింతల శంకర్‌రెడ్డి నిందితుల అరెస్ట్, హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన కవితకు కాటారంకు చెందిన రామిళ్ల మల్లయ్యకు గత 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి శ్రీజ, శిరిణి కూతుర్లు ఉన్నారు. భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో గత పదేళ్లుగా విడిపోయి కవిత తన తల్లిగారి ఊరైన కొత్తపల్లిలో కూతుర్లతో కలిసి జీవనం సాగిస్తుంది. గత రెండేళ్లుగా టీడీపీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలిగా కొనసాగుతుంది. ఇదే క్రమంలో కవితకు దూరపు బంధువు వరుసకు బావ అయిన ములుగు సర్పంచ్ గుగ్గిళ్ల సాగర్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా కొంత కాలానికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరుచు ఇరువురు కలుస్తుండడంతో విషయం కాస్తా సాగర్ భార్య సుజాతకు తెలియడంతో వారిద్దరిపై నిఘా పెంచింది. గత ఏడాది కవిత–సాగర్లు కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సుజాత పద్ధతి మార్చుకోవాలని కవితను తీవ్రంగా మందలించింది. పెద్దమనుషులు సర్దిచెప్పడంతో పాటు పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ సైతం ఇచ్చారు. ఇదంతా జరిగినప్పటికీ కవిత–సాగర్ల ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో తన భర్త ఎక్కడ దూరమవుతాడో తన పిల్లల పరిస్థితి ఏంటని తీవ్ర మనోవేదనకు గురైన సుజాత తన పిల్లలతో కలిసి పలుమార్లు ఆత్మహత్యకు యత్నించింది. హత్యకు ప్లాన్ జరిగిందిలా.. గత కొంత కాలంగా సాగర్–సుజాత ఇంట్లో ఆశ్రయం పొందుతున్న వెంకటాపూర్ మండల పెద్దాపూర్ గ్రామానికి చెందిన రజనీకాంత్‌కు తన బాధను చెప్పుకొని సుజాత కన్నీరుమున్నీరయింది. ఆత్మహత్య చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని నీ జీవితాన్ని నాశనం చేస్తున్న కవితను అడ్డుతప్పిస్తే ఎలాంటి గొడవ ఉండదని అది నేను చూసుకుంటానని రజనీకాంత్ సుజాతకు భరోసా కల్పించాడు. కవితను హత్య చేయించాలని నిర్ణయానికి వచ్చిన సుజాత రజనీకాంత్ సాకారం కోరుతుంది. గతంలో ప్రజాప్రతిఘటన కొరియర్‌గా పని చేసిన రజనీకాంత్ పెద్దాపూర్ గ్రామానికి చెందిన నిషేధిత పీపీజీ కొరియర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా గతంలో పని చేసిన కన్నూరి కుమారస్వామిని సంప్రదించాడు. కుమారస్వామి కవితను చంపేందుకు ఒప్పుకోవడంతో సాగర్ భార్య సుజాతతో రజనీకాంత్ ఫోన్లో మాట్లాడించి రూ.5లక్షలకు సుపారి మాట్లాడుకొని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే క్రమంలో ఆమెతో సన్నిహితంగా ఉండి విభేధాలతో దూరమైన కొత్తపల్లి మాజీ ఉపసర్పంచ్ చిట్యాల చంద్రయ్య ద్వారా కవిత కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్న సుజాత సమాచారాన్ని కుమారస్వామికి చేరవేస్తూ వచ్చింది. కవితను హత్య చేసేందుకు రజనీకాంత్, కుమారస్వామి, బస్వరాజుపల్లికి చెందిన కుక్కుమూడి అశోక్, పందికుంటకు చెందిన దుప్పటి మోహన్ అలియాస్ చింటూ, మాడుగుల జగదీశ్, హన్మకొండ పెద్దమ్మగడ్డకు చెందిన ఆత్కూరి రాజుతో కలిసి ఫిబ్రవరి నెల నుంచి పలుమార్లు కొత్తపల్లికి వచ్చి కవిత ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. మార్చి 11 అర్థరాత్రి అశోక్, రజనీకాంత్, మలుగు మండలం పందికుంటకు చెందిన నూనుగంటి చిరంజీవి అలియాస్ అభిలాష్‌తో కలిసి భూపాలపల్లిలో చేతి గ్లౌజులు, మంకీ క్యాప్స్, కిచెన్ నైఫ్స్ కొనుక్కొని కొత్తపల్లికి చేరుకున్నారు. కవిత తన ఇంట్లో పెద్ద కూతురు శ్రీజతో కలిసి నిద్రిస్తుండగా ఇంటి వెనక గల తలుపులు లేని కిటీకి నుంచి అశోక్, చిరంజీవి మంకీ క్యాప్‌లు ధరించి ఇంట్లోకి వెళ్లగా రజనీకాంత్ ఇంటి బయట కాపలగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు కలిసి నిద్రిస్తున్న కవితను తమ వెంట తెచ్చుకున్న కత్తులతో కవిత ముఖంపై దాడి చేయడానికి ప్రయత్నించగా పక్కనే నిద్రిస్తున్న శ్రీజ నిద్రలేచి కేకలు వేయబోగా దుండగులు ఆమె చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కారు. ఇంట్లో ఉన్న కత్తిపీటతో కవిత ముఖం, గొంతుపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావానికి గురైన కవిత అక్కడికక్కడే మృతి చెందింది. కవిత మృతి చెందినట్లు నిర్థారించుకున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. హత్య విషయాన్ని తెలుసుకున్న ఏఎస్పీ రాజమహేంద్రనాయక్, కాటారం డీఎస్పీ కేఆర్కే ప్రసాద్‌రావు, సీఐ చింతల శంకర్‌రెడ్డి, ఎస్సైలు తిరుపతి, నరేశ్, రాజు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందం ద్వారా వివరాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. కవిత కాల్ డేటా, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో పాటు కూతురు శ్రీజ చెప్పిన వివరాలను తీసుకొని అన్ని కోణాల్లో విచారణ చేపట్టి చివరకు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య మిస్టరీ వీడినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ఏడుగురు నిందితులు సుజాత, రజనీకాంత్, కుమారస్వామి, అశోక్, మోహన్, చంద్రయ్య, జగదీష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. కాగా హత్యలో పాల్గొన్న మరో నిందితుడు చిరంజీవి, హత్యతో సంబంధం ఉన్న రాజులు పరారీలో ఉన్నట్లు త్వరలోనే వారిని పట్టుకోనున్నట్లు ఆయన తెలిపారు. హత్య కేసును చాకచక్యంగా చేధించిన సీఐ శంకర్‌రెడ్డి, ఎస్సైలు తిరుపతి, రాజు, నరేశ్‌లను ఈ సందర్భంగా డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
అనుమానిస్తోందని అంతమొందించారు
వీడిన హత్య కేసు మిస్టరీ నిందితులను పట్టించిన మృతురాలి గాటు పార్వతీపురం : మృతురాలి పీకపై ఉన్న గాటు ఆధారంగా పార్వతీపురం పోలీసులు హత్యకేసు మిస్టరీని ఛేదించారు. వివాహిత మృతిపై ఆమె సోదరుడిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి నిందితులను ఐదు రోజుల్లోనే పట్టుకొని మంగళవారం మీడియా ముందుంచారు. పార్వతీపురం సీఐ వి.చంద్రశేఖర్ అందించిన వివరాలిలా ఉన్నాయి... శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలసకు చెందిన అనుపోజు సరస్వతి(25)ని పార్వతీపురం చెరువు గట్టు వీధికి చెందిన రాలి అప్పారావు, ఈశ్వరమ్మల కుమారుడు రాలి సంతోష్ కుమార్‌కు గత ఏడాది అక్టోబర్‌లో ఇచ్చి వివాహం చేశారు. గతంలో తనకు వేరే మహిళతో ఉన్న సంబంధంపై అనుమానించడం, ఇంట్లో ప్రతి పనికీ అడ్డుతగలడంతో సరస్వతిని అంతం చేయాలని సంతోష్‌కుమార్ భావించాడు. దీనికితోడు సరస్వతి చనిపోతే వేరే పెళ్లి చేసుకోవచ్చని భావించి అవకాశం కోసం ఎదురుచూశాడు. కుటుంబసభ్యులంతా గత నెల 30నఇంట్లో అగ్నిగంగమ్మ పండగ జరుపుకున్నారు. ఈ వేడుకకు వచ్చిన గజపతినగరం చుట్టం ధర్మవరపు పుష్ప ఓ గదిలో, తల్లిదండ్రులు మరొక గదిలో, భార్యాభర్తలు వేరే గదిలోనూ పడుకున్నారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో సంతోష్‌కుమార్ తన తండ్రి వద్దకు వెళ్లి మన మాటకు అడ్డు తగులుతూ అనుమానిస్తున్న సరస్వతిని చంపేద్దామని చెప్పాడు. దీనికి తండ్రి అంగీకరించాడు. వెంటనే సంతోష్‌కుమార్ తన గదిలోకి వెళ్లి నిద్రిస్తున్న సరస్వతిని జుట్టుపట్టుకొని తీసుకొచ్చి మంచం కోడుకు పీక ఆనించి గొంతు పెగలకుండా బలంగా నొక్కిపట్టాడు. ఆమె కాళ్లు కదలకుండా తండ్రి గట్టిగా పట్టుకోవడంతో అతి కిరాతకంగా చంపేశారు. తర్వాత పైకప్పుకు చున్నీతో వేలాడ దీసి ఉరి వేసుకున్నట్లు చేశారు. ఉదయం 5 గంటలకు నిద్రలేచిన సంతోష్‌కుమార్ తల్లి ఈశ్వరమ్మ, చుట్టం పుష్పకు సరస్వతి ఉరి వేసుకున్నట్లు నమ్మించారు. విషయం బయటకు తెలిస్తే సమస్య వస్తుందని, మామూలుగా ఇంట్లో పడిపోయి చనిపోయినట్లు అందరికీ నమ్మబలికారు. తమ కులాచారం ప్రకారం మృతదేహానికి పసుపు రాసి, మెడపై ఉన్న మంచం కోడు గాటును, ఉరి తాలూకా అచ్చులు కనిపించకుండా మెడకు తువ్వాలు చుట్టి రోకలిని ఆనించి కూర్చోబెట్టారు. సోదరుడి ఫిర్యాదుతో వెలుగులోకి.. ముందు రోజు వరకు సంతోషంగా ఉన్న తమ సోదరి అకస్మాత్తుగా మరణించిందనే విషయాన్ని జీర్ణించుకోలేని మృతురాలి సోదరుడు అనుపోజు అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మృతురాలి పీకపై ఉన్న గాటును గుర్తించారు. దీంతో నిందితులను అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో పట్టణ, రూరల్ ఎస్ఐలు బి.సురేంద్రనాయుడు, వి.అశోక్ కుమార్, సిబ్బంది ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. -
వివాహానికి అడ్డొస్తుందనే..
చౌటుప్పల్ :చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం శివారులో ఈ నెల 4వ తేదీన వెలుగుచూసినమహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో వివాహానికి అడ్డొస్తుందనే కారణంతోనే ఈ దారుణం చోటు చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు విలేకరులకు హత్యకేసు వివరాలు వెల్లడించారు. నార్కట్‌ప ల్లి మండలం చిన్నతుమ్మలగూడెం గ్రామానికి చెందిన నల్ల నీలమ్మ(28)కు రామన్నపేట మం డలం కక్కిరేణికి చెందిన కిష్టయ్యతో 10ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈమెకు కుమారు డు, కుమార్తె ఉన్నారు. చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామానికి చెందిన గంగిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి(21) ఇంటర్ ఫెయిల్ అయి, వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది వరికోత యంత్రాన్ని కొనుగోలు చేశా డు. వరికోత యంత్రం డ్రైవర్‌గా ఈయనే పనిచేస్తున్నాడు. గత ఏడాది వరిచేలు కోసేం దుకు కక్కిరేణికి వెళ్లాడు. వరికోత మిషన్ వద్దకు నీలమ్మ కూలి పనికి వచ్చింది. అక్కడ నీలమ్మతో రాజశేఖర్‌రెడ్డికి పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. రాజశేఖర్‌రెడ్డికి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు పెళ్లిసంబంధాలు చూస్తున్నారు. ఈ విషయా న్ని రాజశేఖర్‌రెడ్డి నీలమ్మకు తెలిపాడు. నేనుం డగా, నీవు పెళ్లి ఎలా చేసుకుంటావని నీలమ్మ నిలదీసింది. దీంతో రాజశేఖర్‌రెడ్డి నీలమ్మను వదిలించుకోవాలని హత్యకు పథకం వేశాడు. నీలమ్మ పేరుతోనే సిమ్‌కార్డు తీసుకుని.. రాజశేఖర్‌రెడ్డి తన సెల్‌నంబర్ నుంచి నీలమ్మ తో నిత్యం సెల్ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో హత్య చేస్తే, సెల్‌ఫోన్ నంబరు ఆధారంగా పోలీసులకు దొరికి పోతామని, ఆమెకు మాయ మాటలు చెప్పి అడ్రస్ ప్రూఫ్ తీసుకున్నాడు. ఆ అడ్రస్ ప్రూఫ్‌తో నీల మ్మ పేరు మీద సిమ్‌కార్డు తీసుకున్నాడు. ఈ నంబరుతోనే మాట్లాడుతున్నాడు. దసరా పం డగకు రెండు రోజుల ముందుగానే నీలమ్మ, తల్లిగారి ఊరైన చిన్నతుమ్మలగూడేనికి వెళ్లింది. సద్దుల బతుకమ్మ రోజు, రాజశేఖర్‌రెడ్డి నీలమ్మ కు ఫోన్ చేసి పండగకు బట్టలు ఇప్పిస్తా, చౌటుప్పల్‌కు రమ్మని చెప్పాడు. దీంతో ఆమె ఈ నెల 2వ తేదీన రాత్రి పిల్లలను ఇంటి వద్దే వదిలి, చౌటుప్పల్‌కు వచ్చింది. రాజశేఖర్‌రెడ్డి ఆమెను చౌటుప్పల్ నుంచి బైకుపై ఎక్కించుకుని ఎస్.లింగోటం శివారులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. గొంతు నులిమి, బండరాయి తలపై ఎత్తేసి, హత్య చేశాడు. ఆమె ఒంటిపైనున్న బంగారు పుస్తె, చెవి కమ్మలు, పట్టాలను తీసుకుని పరారయ్యాడు. ఈ నెల 4వ తేదీన శవాన్ని గుర్తించిన పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 4, 5తేదీల్లో నీలమ్మ మృతదేహాన్ని ఆసుపత్రిలోనే భద్రపరిచారు. అప్పటికే శవం కుళ్లిపోయి, దుర్వాసన వస్తుండడంతో గ్రామపంచాయతీ సిబ్బందితో పూడ్చివేయించారు. కాగా, నీలమ్మ కనిపిం చ డం లేదని ఆమె కుటుంబ సభ్యులు ఈ నెల 7వ తేదీన నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. ఇక్కడ గుర్తు తెలియని శవం లభిం చడంతో, ఇక్కడికి వచ్చి, ఆమె వస్త్రాలను చూ సి, నీలమ్మగా గుర్తించారు. నీలమ్మ సెల్‌నంబరు తీసుకుని, పోలీ సులు దర్యాప్తు చేశా రు. రాజశేఖర్‌రెడ్డి నీలమ్మతో అప్పటి వరకు తన సెల్‌నంబరుతో మాట్లాడి, హత్యకు వారం రోజుల ముందు నుంచి కొత్త నంబరుతో పదేపదేమాట్లాడుతుండడంతో అనుమానం వచ్చి, అదుపులోకి తీసుకుని విచారించడంతో, హత్య కేసు మిస్టరీ వీడింది. అతడి వద్ద నుంచి సెల్ఫోన్లు, బంగారు ఆభరణాలు, మోటారుసైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. రామన్నపేట కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో ఎస్ఐలు హరిబాబు, మల్లీశ్వరి పాల్గొన్నారు.