ఆస్తి కోసం తండ్రి తల పగులగొట్టిన కిరాతకుడు | Son attacks Father with Axe | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం తండ్రి తల పగులగొట్టిన కిరాతకుడు

Published Sat, May 16 2015 3:41 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

Son attacks Father with Axe

జియాగూడ (హైదరాబాద్) : కన్న తండ్రి కంటే కాసులే అతడికి పరమార్థమయ్యాయి. తండ్రి పేరుతో ఉన్న ఇంటిని అమ్మాలని ఒత్తిడి తెచ్చాడు. కాదన్నందుకు తండ్రిపై కిరాతకంగా దాడి చేశాడు. హైదరాబాద్ జియాగూడ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... కిషన్‌బాగ్‌లో నివాసం ఉండే అబ్దుల్ మన్నాన్(80)కు మెహదీపట్నంలో ఇల్లు ఉంది. దానిపై కుమారుడు అక్బర్(46) కన్ను పడింది. దాన్ని అమ్మాలంటూ కొంత కాలంగా అక్బర్ మన్నాన్పై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మన్నాన్ జియాగూడలో ఉండే తన కూతురు ఇంట్లో ఓ కార్యక్రమానికి వచ్చాడు. దీనికి అక్బర్ కూడా రావడంతో ఇంటిని అమ్మే విషయంలో తండ్రీ కొడుకుల మధ్య వాదన జరిగింది. ఆవేశానికి గురైన అక్బర్ గొడ్డలి తీసుకుని తండ్రి తలపై వేటు వేశాడు. తీవ్ర గాయాలైన అతడ్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement