పశ్చిమగోదావరి (తణుకు) : కంటికి రెప్పలా కాపాడాల్సి కన్నతండ్రే కుమారుడి పీక కోసిన ఘటన తణుకు మండలకేంద్రంలో శనివారం రాత్రి 11 గంటలకు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..తణుకుకు చెందిన షేక్ బాబ్జీ అనే వ్యక్తి తన కుమారుడు షేక్ బహుదుల్లా(15)పై దాడి చేశాడు. అతని గొంతు కోశాడు. అనంతరం తన చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడిన కుమారుడిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు కుటుంబకలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కుమారుడి గొంతు కోసిన తండ్రి
Published Sun, Sep 6 2015 9:44 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
Advertisement
Advertisement