
ప్రతీకాత్మక చిత్రం
తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కన్నకుమారుడే తండ్రి పాలిట కాలయముడయ్యాడు. మద్యం మత్తులో ఉన్న తండ్రి నూతంగి సూరయ్య(45)ను కుమారుడు నూతంగి వెంకటేశ్ కొట్టి చంపాడు. కర్రతో తలపై బలంగా కొట్టడంతో సూరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. నిత్యం తాగి వచ్చి తన తల్లిని కొడుతున్నాడని, ఆవేశంలో తండ్రిని హతమార్చానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. నిందితుడు నూతంగి వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment