మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం అంతారం గ్రామంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు.
తలకొండపల్లి (మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం అంతారం గ్రామంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన అంజయ్య మద్యం మత్తులో శనివారం రాత్రి భార్య అంజమ్మ(50)తో గొడవ పడ్డాడు. డబ్బులు అడిగితే ఇవ్వకపోవడంతో గొడవపడి ఆవేశంలో గొడ్డలితో ఆమె తలపై వేటు వేశాడు. తీవ్రంగా గాయపడిన అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.