అనుమానం పెనుభూతమై విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను దారుణంగా కడతేర్చాడు.
మహబూబ్‌నగర్ : అనుమానం పెనుభూతమై విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను దారుణంగా కడతేర్చాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం రాంపూర్ గ్రామంలో గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. రాంపూర్ గ్రామానికి చెందిన కోటిరాజన్న(58), సత్తమ్మ(52)లు భార్యభర్తలు.
కాగా గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతోపాటు, భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో గురువారం మధ్యహ్నం ఇంట్లో ఆమె నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికి చంపాడు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటాన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.