ఆత్మకూరు : మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండలం తుక్యానాయక్ తండాలో ఘోరం జరిగింది. ఓ మహిళ భర్తను దారుణంగా హతమార్చింది. ప్రాథమిక సమాచారం మేరకు.. శాంతమ్మ, గోవింద్ నాయక్లు భార్యాభర్తలు. అయితే శాంతమ్మ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తుండడంతో ఈ విషయమై గోవింద్ నాయక్, ఆమెకు మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో గోవింద్‌నాయక్ గురువారం రాత్రి మద్యం తాగి ఇంటి ఆవరణలో మంచంపై నిద్రించగా... శాంతమ్మ శుక్రవారం తెల్లవారుజామున అతడిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో గోవింద్ నాయక్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. అయితే ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. కాగా పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
అడ్డొస్తున్నాడని భర్తను కడతేర్చింది..
Published Fri, Sep 11 2015 4:15 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement