సాక్షి, అడ్డాకుల (పాలమూరు): ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భర్త సుధాకర్‌రెడ్డిని దారుణంగా హతమార్చిన స్వాతిరెడ్డి కేసు మరువక ముందే పాలమూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రియుడికి డబ్బులిచ్చి మరీ భర్తను హతమార్చింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా.. మండలంలోని రాచాల గ్రామానికి చెందిన కమ్మరి నాగరాజు(33) హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా మృతి కేసులో మిస్టరీ వీడింది. మొదట తన భర్త కనిపించడం లేదని భార్య జ్యోతి బంధువులను నమ్మించింది. తీరా ఇప్పుడు భర్త మృతి కేసులో భార్య జ్యోతి హస్తం ఉందన్న విషయం పోలీసుల విచారణలో తేలింది.
హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న నాగరాజు డిసెంబర్ 31న ఉదయం ఇంటి నుంచి వెళ్లి కనిపిచడం లేదని భార్య జ్యోతి బంధువులకు సమాచారమిచ్చింది. అదే రోజు నాగరాజు మృతదేహం చౌటుప్పల్ ఠాణా పరిధిలో పోలీసులకు లభించిన తర్వాత దాన్ని జనవరి 2న బంధువులు స్వగ్రామమైన రాచాలకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే నాగరాజు హత్య కేసులో భార్యను అనుమానించిన చౌటుప్పల్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
నాగరాజు మృతి కేసులో భార్య జ్యోతి, ప్రియుడు కార్తీక్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారని నాగరాజు సోదరుడు శ్రీనివాసులు తెలి పారు. పెళ్లికి ముందే హైదరాబాద్‌లో ఉంటున్న కార్తీక్‌ను ప్రేమించిన జ్యోతిని తల్లిదండ్రులు నాగరాజుకు ఇచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలో వారికి ఇద్దరు సంతానం కలిగారు. అయితే ఇటీవల జ్యోతి తన ప్రియుడిని కలుసుకున్న తర్వాత భర్త నాగరాజును అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు కలిసి హత్యకు పథకం రచించారు.
మత్తు మందు కలిపి..
ఈ నేపథ్యంలో తమకు అడ్డుగా వస్తున్నాడని భావించిన జ్యోతి తన భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగా తన ప్రియుడైన కార్తీక్‌కు కొంత డబ్బు ఇచ్చి తన భర్తను అంతమొందించాలని చెప్పింది. దీంతో కార్తీక్ తన మిత్రులైన దీప క్, యాసీన్, నరేష్‌ను సంప్రదించాడు. హత్యకు అనువైన రూపకల్పన తయారు చేశారు. దావత్ పేరుతో గత డిసెంబర్ 31న అంతా ఒక దగ్గర కలిశారు. అదును చూ సి నాగరాజు గొంతు నులిమి హతమార్చారు. శవాన్ని కారులో జిల్లేడుచెల్క సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి శవాన్ని కంపచెట్లల్లో పడేసి వెళ్లిపోయారు.
రాచాలలో విషాదం..
నాగరాజు మృతి చెందిన కేసులో భార్య జ్యోతి ప్రమేయం ఉందని వార్తలు వెలువడంతో రాచాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రియుడితో కలిసి భార్యనే హత్య చేయించిన విషయాన్ని తెలుసుకుని బంధువులు తీరని దుఃఖసాగరంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment