గొడ్డలితో భార్య ముక్కు తెగ్గొట్టాడు.. | Man attacks wife with axe | Sakshi
Sakshi News home page

గొడ్డలితో భార్య ముక్కు తెగ్గొట్టాడు..

Published Thu, Jan 14 2016 6:08 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

Man attacks wife with axe

నారాయణఖేడ్ (మెదక్) : తాగిన మైకంలో ఓ వ్యక్తి భార్యపై గొడ్డలితో దాడి చేయగా ఆమె ముక్కు తెగిపోవటంతోపాటు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నారాయణఖేడ్ పట్టణం దత్తాత్రేయకాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఉబ్ది పాండు, కేశమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు, ఓ కుమారుడు ఉన్నారు. కాగా పాండు తరచూ తప్పతాగి వచ్చి భార్యను కొట్టేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయేది.

ఇదే విధంగా ఇటీవల కేశమ్మ పుట్టింటికి వెళ్లిపోగా మద్యం తాగనని పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకుని భార్యను తెచ్చుకున్నాడు. అయినప్పటికీ బుధవారం రాత్రి తల్లి పోచమ్మతో కలసి పూటుగా మద్యం తాగాడు. అనంతరం పాండు భార్య, తల్లితో గొడవకు దిగాడు. కోపంలో ఉన్న పాండు భార్య కేశమ్మపై గొడ్డలితో వేటువేయగా ఆమె ముక్కు తెగి, తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన కాలనీవాసులు తల్లి, కొడుకుకు దేహశుద్ధి చేశారు. అనంతరం గాయాలపాలైన ముగ్గురినీ చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. కేశమ్మ తండ్రి కేశయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement