ఈ మెయిల్స్ వల్ల 1,900 ఉద్యోగాలు గోవిందా!
సిడ్నీ: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుందంటే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని చాలా మంది ఆశావాహులు భావిస్తారు. కానీ, ఆస్ట్రేలియాలో మాత్రం దీనివల్ల ఏకంగా 1,900 భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ మధ్య కాలంలో ఈమెయిల్స్ ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో ఇక ఉత్తరాల బట్వాడా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పోస్ట్ అనే ఓ సంస్థ కూడా వివిధ సంస్థలు వ్యక్తులకు ఉత్తరాలు చేరవేసే సంస్థను నిర్వహిస్తుండేది. దీని ద్వారా భారీ స్థాయిలో ఆదాయం వస్తుండేది.
అయితే, రాను రాను ఈమెయిల్స్ వాడకం ఎక్కువై ఉత్తరాలు ఉపయోగించేవారి సంఖ్య తక్కువవడంతో ఆ సంస్థ ఆదాయం పడిపోయింది. పైగా లావాదేవీలు పది శాతం తగ్గాయి. దీంతో ఉత్తరాలు చేరవేసేవారు పని లేకుండా ఖాళీగా ఉండటం, అనుకున్న లావాదేవీలు జరగకపోవడంతో మూడేళ్లలో మొత్తం 1,900 మందిని తొలగించినున్నామని ప్రకటించింది.