చెల్లిను గొడ్డలితో నరికిన అన్న | Brother kills Sister With Axe | Sakshi
Sakshi News home page

చెల్లిను గొడ్డలితో నరికిన అన్న

Published Thu, May 7 2015 8:54 AM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

Brother kills Sister With Axe

కరీంనగర్: క్షణికావేశంతో సొంత సోదరిపై గొడ్డలితో దాడిచేసి చంపేశాడో కిరాతక అన్నయ్య..ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఆత్మకూరు గ్రామానికి చెందిన రాజంలింగం(28) వ్యవసాయ కూలిగా జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం సోదరి లత(20)తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన రాజంలింగం పక్కనే ఉన్న గొడ్డలితో సోదరిపై విచక్షణారహితంగా దాడిచేసి నరికేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

 

వీరి తల్లిదండ్రులు పదేళ్ల కిందటే మరణించారు. అప్పటినుంచి ఇద్దరు సోదరులు ఐదుగురు అక్కాచెల్లెళ్లెను పెంచి పెద్దచేశారు. రాజంలింగం స్థానికంగా ఉంటూ వ్యవసాయ పనులు చూసుకుంటుండగా మరో సోదరుడు దుబాయ్‌లో ఉంటున్నాడు. అన్యోన్యంగా ఉండే కుటుంబంలో ఒక్కసారిగా ఇలాంటి సంఘటన జరగడంతో గ్రామం ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement