Wrap For The Shoot Of The Nagarjuna Action Movie The Ghost - Sakshi
Sakshi News home page

The Ghost: 'ది ఘోస్ట్‌' షూటింగ్‌ పూర్తి.. వీడియో వైరల్‌

Published Tue, Aug 9 2022 9:14 AM | Last Updated on Tue, Aug 9 2022 10:16 AM

Wrap For The Shoot Of The Nagarjuna Action Movie The Ghost - Sakshi

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది ఘోస్ట్‌’. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్‌. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ ఆశీస్సులతో సునీల్‌ నారంగ్, పుస్కర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలియ జేసింది చిత్ర యూనిట్‌.

‘‘హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ది ఘోస్ట్‌’.  ఇందులో పవర్‌ఫుల్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ విక్రమ్‌గా కనిపించబోతున్నారు నాగార్జున. అక్టోబర్‌ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ముఖేష్‌ జి, సంగీతం: మార్క్‌ కె. రాబిన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement