Nagarjuna Akkineni First Look From The Ghost Movie Released - Sakshi
Sakshi News home page

Nagarjuna Ghost 'ఘోస్ట్‌'గా కింగ్‌ నాగార్జున.. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌

Published Sun, Aug 29 2021 10:51 AM | Last Updated on Sun, Aug 29 2021 12:56 PM

Nagarjuna Akkineni First Look From The Ghost Movie Released - Sakshi

అక్కినేని నాగార్జున హీరోగా డైరెక్టర్‌ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం(ఆగస్టు29)న నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌తో పాటు నాగార్జున ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌ చేశారు. ఫాంటసీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'ఘోస్ట్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వర్షంలో కత్తి పట్టుకొని ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్ ప్యాక్‌ లుక్‌లో నాగార్జున కనిపిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్‌ చేసిన ప్రీలుక్‌తో పాటు పోస్టర్‌  సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేస్తుంది. ఈ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న విదేశీ బ్యాడ్డీలు, లండన్ ల్యాండ్‌స్కేప్ పిక్లు హైలెట్‌గా కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనుంది.. 

చదవండి : Raj Tarun: నాగార్జున చేతుల మీదుగా రాజ్‌ తరుణ్‌ మూవీ ఫస్ట్‌లుక్‌
అందుకే నాగార్జున పరిశ్రమలో స్పెషల్‌ వన్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement