కప్పను చంపి ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు వండి పెట్టాడు. దీంతో కుంటుంబ అంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యింది. ఈ ఘటన ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో చోటు చేసుకుంది. మున్నా అనే వ్యక్తి ఇంట్లోకి కప్ప వచ్చింది. అతను పాముపై ఉన్న కోపంతో కప్పను చంపి దానితో సాంబారు చేశాడు. దీన్ని కుటుంబ సభ్యులంతా తిన్నారు. కొద్ది సేపటికే వారంతా వాంతులు చేసుకుని స్ప్రుహతప్పి పడిపోయారు.
తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులను ఆస్పత్రికి తరలించగా.. ఆరేళ్ల చిన్నారి సుమిత్ర ముండా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అంతేగాదు మరో నాలుగేళ్ల చిన్నారి మున్నీ పరిస్థితి విషమంగానే ఉంది. ఆ కూర తిన్న ఆ చిన్నారుల తండ్రి కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ మేరకు పోలీసులు ఆ చిన్నారి మృతిని అసహజ మరణంగా కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
ఇదిలా ఉండగా, వీఎస్ఎస్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ సంజీబ్ మిశ్రా మాట్లాడుతూ..కప్పల శరీరంలోని పరోటిడ్ గ్రంథి వాటిని వేటాడే జంతువుల నుంచి రక్షించుకోవడానికి విషాన్ని కలిగి ఉంటుంది. ఇది కప్పను తినే వారిపై ప్రభావం చూపుతుంది. అలాగే కొన్ని కప్పల చర్మం కూడా విషపూరితంగా ఉంటుందని మిశ్రా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment