
భోపాల్ : వరుణదేవుడి కరుణ కోసం మధ్యప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లలితా యాదవ్ కప్పలకు పెళ్లి చేశారు. చత్తర్‌పూర్‌లో ఓ గుడిలో ఈ తతంగం జరిగినట్లు తెలిసింది. ఈ వేడుక కోసం వందల సంఖ్యలో ప్రజలు ఆలయం వద్ద గుమిగూడారు.
కప్పల వివాహ వేడుక అనంతరం విందు భోజనాలు కూడా పెట్టారు. కాగా, వరుణ దేవుడికి పూజలు చేస్తే వర్షాలు కురుస్తాయనే మూఢ నమ్మకం వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సాక్షాత్తు మంత్రి ఈ పని చేయడంపై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment