వర్షం కోసం కప్పల ఊరేగింపు
యాగంటిపల్లె(బనగానపల్లె రూరల్ ) : వర్షాలు కురువాలని గ్రామస్తులు ఆదివారం కప్పలతో ఊరేగింపు నిర్వహించారు. ఒక కర్రకు మధ్యలో కప్పలను వేలాడదీసి డప్పు వాయిద్యాలతో ఇంటింటికి తీరుగుతూ వర్షాలు కురువాలని వానదేవుడిని వేడుకున్నారు. సాయంత్రం సమీపంలో ఉన్న వాగులోనికి వెళ్లి గంగ పూజలు చేశారు.