‘నా ముందు నువ్వేంత అనుకుంది.. కానీ’ | Viral Video A Tiny Frog In A Fight With Leopard | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో.. కప్ప, చిరుతల ఫైటింగ్‌

Published Thu, May 21 2020 2:41 PM | Last Updated on Thu, May 21 2020 2:45 PM

Viral Video A Tiny Frog In A Fight With Leopard - Sakshi

బలవంతుడి చేతిలో బలహీనుడు ఓడిపోవడం సర్వ సాధారణం. కానీ ఆ బలహీనుడు తిరగబడితే.. బలవంతుడు కూడా తోక ముడవక తప్పదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ వీడియో. ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సుశాంత నంద ‘కాలం మారుతోంది. కప్ప, చిరుతల మధ్య నమ్మశక్యం కానీ పోరు. ఎవరు గెలుస్తారో చూడండి’  అంటూ ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో ఓ చిరుత పులి తన పంజాతో పదే పదే కప్పను తాకుతూ ఉంటుంది. రెండు సార్లు చిరుత మొరటుతనాన్ని భరించిన కప్ప.. మూడో సారి చిరుత ప్రతిఘటిస్తుంది. దాంతో ఓటమిని ఒప్పుకుని అక్కడ నుంచి వెళ్లిపోతుంది చిరుత.(ఆ ఫోటో వెనక ఇంత కథ ఉంది)

18 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 5 వేల మంది వీక్షించారు. ‘పిల్లి కుటుంబానికి చెందిన జంతువులు కప్పలను వేటాడవు.. కేవలం ఆడుకుని వదిలేస్తాయి.. ఈ పులి ఇంకా చిన్నదే. ఈ ప్రపంచం గురించి ఇంకా పూర్తిగా తెలియదనుకుంటా. అందుకే తన ముందు ఉన్న జీవి ఏంటో గుర్తించేందుకు ప్రయత్నిస్తుంది’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.(వీడియోలోని జీవి ఏంటో చెప్పగలరా?!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement