
లిఫ్ట్ ప్లీజ్..
ఎక్కడికైనా వేగంగా వెళ్లాలనుకున్నప్పుడు అడక్కఅడక్క నత్తను ఎవరైనా లిఫ్ట్ అడుగుతారా? ఈ కప్ప అడిగింది. అనుభవమైతే కానీ అసలు విషయం అర్థం కాదుగా.. ఓ 5 నిమిషాలు నత్తపై అలాగే ఉంది. అసలే నత్తనడక. అందుకే అంత సమయంలోనూ అది కేవలం 30 సెంటీమీటర్లు మాత్రమే నడిచిందట. దీంతో దీనివల్ల కాదనుకుని.. కప్ప నత్తపై నుంచి దిగి తన కాళ్లకు పనిచెప్పిందట. ఇండోనేసియాలోని సాంబాస్‌లో చోటుచేసుకున్న ఈ సన్నివేశాన్ని ఫొటోగ్రాఫర్ హెండీ క్లిక్‌మనిపించారు.