![Indonesian Woman Flogged 100 Times Publicly For Adultery - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/14/Indonesia.jpg.webp?itok=fpTNBulk)
ఒక్కో దేశంలో ఒక్కో రకంగా నేరస్తులకి శిక్షలు విధిస్తారు. అవి ఆ దేశ సంప్రదాయాన్ని అనుసరించి విధించడమో లేక నేరస్తుల్లో పరివర్తన కోసమో అమలు చేస్తుంటారు. అచ్చం అలాంటి సంఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది.
ఇండోనేషియాలోని ఎచెహ్ ప్రావిన్స్‌లో ఒక మహిళ వివాహేతర సంబంధం గుట్టు రట్టు అయ్యింది. పామాయిల్ చెట్లలో ఏకాంతంగా ఆ జంటను స్థానికులు దొరకబట్టారు. అయితే ఆ ప్రియుడు వివాహేతర సంబంధం ఆరోపణల్ని తోసిపుచ్చాడు. ఆమె మాత్రం అది నిజమని ఒప్పుకుంది. దీంతో ఆమెకు 100 కొరడా దెబ్బలు.. ప్లేట్ ఫిరాయించిన ప్రియుడికి 15 కొరడా దెబ్బల శిక్ష అమలు చేశారు.
ఆమెకు వివాహం కాలేదు. ఇలా లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్లు అంగీకరించడంతో ఆమెకు ఇంత కఠినమైన శిక్ష విధించినట్లు జడ్జి ఇవాన్ నజ్జర్ అలవి చెప్పారు. జూదం, వ్యభిచారం, మద్యం సేవించడం, స్వలింగ సంపర్కం వంటి చర్యలపై కొరడా ఝులిపించేందుకు పర్షియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తోన్న ఏకైక ప్రాంతం ఇండోనేషియాలోని ఎచెహ్. పైగా అక్కడ శిక్షలను బహిరంగంగా అమలు చేస్తారు.
(చదవండి: నన్ అత్యాచార నిందితుడు బిషప్ ఫ్రాంకోని నిర్దోషిగా ప్రకటించిన కేరళ కోర్టు)
Comments
Please login to add a commentAdd a comment