adultery case
-
వివాహేతర సంబంధం: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిందని ఘోరంగా శిక్షించారు
ఒక్కో దేశంలో ఒక్కో రకంగా నేరస్తులకి శిక్షలు విధిస్తారు. అవి ఆ దేశ సంప్రదాయాన్ని అనుసరించి విధించడమో లేక నేరస్తుల్లో పరివర్తన కోసమో అమలు చేస్తుంటారు. అచ్చం అలాంటి సంఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఇండోనేషియాలోని ఎచెహ్ ప్రావిన్స్‌లో ఒక మహిళ వివాహేతర సంబంధం గుట్టు రట్టు అయ్యింది. పామాయిల్ చెట్లలో ఏకాంతంగా ఆ జంటను స్థానికులు దొరకబట్టారు. అయితే ఆ ప్రియుడు వివాహేతర సంబంధం ఆరోపణల్ని తోసిపుచ్చాడు. ఆమె మాత్రం అది నిజమని ఒప్పుకుంది. దీంతో ఆమెకు 100 కొరడా దెబ్బలు.. ప్లేట్ ఫిరాయించిన ప్రియుడికి 15 కొరడా దెబ్బల శిక్ష అమలు చేశారు. ఆమెకు వివాహం కాలేదు. ఇలా లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్లు అంగీకరించడంతో ఆమెకు ఇంత కఠినమైన శిక్ష విధించినట్లు జడ్జి ఇవాన్ నజ్జర్ అలవి చెప్పారు. జూదం, వ్యభిచారం, మద్యం సేవించడం, స్వలింగ సంపర్కం వంటి చర్యలపై కొరడా ఝులిపించేందుకు పర్షియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తోన్న ఏకైక ప్రాంతం ఇండోనేషియాలోని ఎచెహ్. పైగా అక్కడ శిక్షలను బహిరంగంగా అమలు చేస్తారు. (చదవండి: నన్ అత్యాచార నిందితుడు బిషప్ ఫ్రాంకోని నిర్దోషిగా ప్రకటించిన కేరళ కోర్టు) -
టీడీపీ నేత ఇంటిపై పోలీసుల దాడి
రాజమహేంద్రవరం రూరల్: పిడింగొయ్యి గ్రామ పంచాయతీ పరిధిలోని బుచ్చియ్యనగర్ డెయిరీ కాలనీలో ఉంటున్న టీడీపీ నేత పిన్నింటి వెంకట రవి శంకర్ ఇంటిపై బుధవారం మధ్యాహ్నం బొమ్మూరు పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో టీడీపీ నేతతో పాటు మరో వ్యక్తి ఇద్దరు మహిళలతో పట్టుబడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. టీడీపీ నేత పిన్నింటి వెంకట రవిశంకర్ ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచారం చేస్తున్నారన్న సమాచారం అందుకున్న బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఎస్సై శుభశేఖర్, సిబ్బందితో ఆయన ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో రవిశంకర్ గదిలో ఇద్దరు అమ్మాయిలతో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వందే కిశోర్ అనే వ్యక్తిని, రవిశంకర్‌లను బొమ్మూరు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వ్యభిచారం చేస్తున్నారన్న దానిపై ఎస్సై శుభాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ నేత రవిశంకర్‌ను తప్పించేందుకు టీడీపీ యువనేత ఒకరు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. వెండి వ్యాపారం చేసే రవిశంకర్ వద్దకు వెండి వస్తువులు కొనుగోలు చేసేందుకు అమ్మాయిలు వచ్చారని నమ్మించే ప్రయత్నాలు చేశారు. కాని సంఘటన స్థలంలో మద్యం బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు లభించాయి. మూడు రోజులుగా టీడీపీ నేత ఇంటి వద్ద కార్లు, అమ్మాయిల హడావుడి ఉన్నట్టు పోలీసులు విచారణలో తేలినట్టు విశ్వసనీయ సమాచారం. -
యాదాద్రి చిన్నారుల కేసులో హైకోర్టు కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: యాదాద్రిలో చిన్నారులను వ్యభిచార వృత్తిలోకి దింపిన వ్యవహారంపై విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తామని హైకోర్టు తెలిపింది. ఇది బాలల స్నేహపూర్వక కోర్టుగా ఉంటుందని పేర్కొంది. ఈ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై మరికొందరు కూడా పిల్ దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. న్యాయవాది వసుధా నాగరాజ్ వాదిస్తూ పిల్లలను వారి తల్లులు కలుసుకునే అవకాశం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఓ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశామన్నారు. సిట్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ వారు జన్మనిచ్చిన తల్లులు కాదని, పెంచిన తల్లులని కోర్టుకు నివేదించారు. ఈ కేసులో ఎప్పటిలోపు దర్యాప్తు పూర్తిచేస్తారో, చార్జిషీట్ దాఖలు చేస్తారో తెలపాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) కోర్టు ఆదేశి స్తూ విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. -
నయీం కేసులో సస్పెన్షన్ల ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో పోలీస్ అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేతకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. నయీంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, ఏసీపీలు మలినేని శ్రీనివాస్‌రావు, చింతమనేని శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు రాజగోపాల్, మస్తాన్‌లపై సస్పెన్షన్ వేటు పడటం తెలిసిందే. గతేడాది మే నుంచి ఈ ఐదుగురు అధికారులు సస్పెన్షన్‌లోనే ఉన్నారు. వారితోపాటు మరో 11 మంది అధికారులకు అప్పటి డీజీపీ అనురాగ్ శర్మ చార్జి మెమోలు జారీ చేశారు. మరో ఆరుగురి నుంచి వివరణ తీసుకున్నారు. మొత్తంగా 22 మంది అధికారులు నయీంతో సంబంధాలు కొనసాగించారని సిట్ తేల్చింది. సస్పెన్షన్‌కు గురైన అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు పోలీస్‌శాఖ నుంచి ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదన అందినట్లు హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఏడాదిగా సస్పెన్షన్‌లోనే ఉన్న అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకునేలా ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. 2 రోజుల్లో సస్పెన్షన్ ఎత్తివేతతోపాటు పోస్టింగ్‌లు కల్పిస్తూ ఆదేశాలు వెలువరించే అవకాశం ఉంది. అదనపు ఎస్పీ సునీతపైనా: వివాహేతర సంబంధం కేసులో సస్పెన్షన్‌కు గురైన అవినీతి నిరోధకశాఖ అదనపు ఎస్పీ సునీతనూ తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఆమెతోపాటు ఇన్స్పెక్టర్ మల్లికార్జున్‌రెడ్డిపైనా సస్పెన్షన్ ఎత్తేసే అవకాశం ఉందని పోలీస్‌శాఖ ముఖ్య కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. -
వ్యభిచార గృహం నిర్వాహకురాలికి ఏడాది జైలు
విశాఖ లీగల్: ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మహిళలతో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళకు ఏడాది జైలు, వెయ్యి రూపాయిలు జరిమానా విధిస్తూ నగరంలోని 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి కె.వెంకటరమణా రెడ్డి గురువారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నమ్మి సన్యాసిరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితురాలు జి.మధు(41) వన్‌టౌన్ ప్రాంతంలోని సున్నపు వీధిలో నివసిస్తోంది. గత కొంతకాలంగా ఆమె మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెట్టేది. వారిని మాయమాటలతో వ్యభిచారం ఉచ్చులోకి దించేది. ఈ నేపథ్యంలో వివరాలు సేకరించిన వన్‌టౌన్ పోలీసులు 2013, ఆగస్టు 27న వలపన్ని పట్టుకున్నారు. నిందితురాలిపై వ్యభిచార నియంత్రణ చట్టం ఐపీసీ సెక్షన్3, 4, 7ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేరాభియోగ పత్రం దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో పైవిధంగా తీర్పు చెప్పారు. -
వివాహేతర సంబంధం ఉందని.. దేశ బహిష్కరణ
డచ్ మహిళకు రూ. 53వేల జరిమానా సంబంధం ఉన్న పురుషుడికి 140 కొరడా దెబ్బలు వివాహేతర సంబంధం పెట్టుకొందన్న ఆరోపణలు రుజువు కావడంతో డచ్ మహిళకు ఖతార్ కోర్టు రూ. 53వేల జరిమానా, దేశ బహిష్కరణ శిక్ష విధించింది. ఆమె జరిమానా చెల్లించిన వెంటనే దేశం నుంచి పంపేస్తామని కోర్టు అధికారులు తెలిపారు. అయితే.. తాను అత్యాచారానికి గురైనట్లు ఆమె ఆరోపించింది. తనపై మోపిన ఆరోపణలను ఆమె ఖండించింది. సిరియాకు చెందిన ఒమర్ అబ్దుల్లా అల్ హసన్ అనే వ్యక్తికి ఆమెతో వివాహేతర సంబంధం ఉన్నట్లు కోర్టులో రుజువైంది. దాంతో అతడికి వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు 100 కొరడా దెబ్బలు, మద్యం తాగినందుకు మరో 40 కొరడా దెబ్బలు శిక్షగా విధించారు. అతడు శిక్ష అనుభవించేందుకు తగినంత ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోడానికి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. బాధితురాలు ఖతార్ వదిలి వెళ్లేందుకు తమ రాయబార కార్యాలయం ఆమెకు సాయం చేస్తుందని ఖతార్‌లో డచ్ రాయబారి కోర్టు వద్ద మీడియాకు చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆమె వెళ్లిపోతారన్నారు. ఇక నెదర్లాండ్స్‌లో ఉంటున్న బాధితురాలి తల్లి కూడా తాను తన కూతురితో మాట్లాడానని, ఆమె విడుదల అవుతున్న విషయం తెలిసి సంతోషించానని అన్నారు. బాధితురాలు ఒక పార్టీకి వెళ్లినపుడు డాన్స్ చేస్తోందని, కాస్త డ్రింక్ తాగిన తర్వాత తనకు డ్రగ్స్ ఎక్కించినట్లు ఆమెకు అర్థమైందని ఆమె తరఫు న్యాయవాది చెప్పారు. మర్నాటి ఉదయం తనకు ఏమాత్రం తెలియని ఒక అపార్టుమెంటులో ఉందని, అప్పుడే తాను అత్యాచారానికి గురైనట్లు ఆమెకు అర్థమైందని అన్నారు.