
సాక్షి, హైదరాబాద్: యాదాద్రిలో చిన్నారులను వ్యభిచార వృత్తిలోకి దింపిన వ్యవహారంపై విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తామని హైకోర్టు తెలిపింది. ఇది బాలల స్నేహపూర్వక కోర్టుగా ఉంటుందని పేర్కొంది. ఈ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై మరికొందరు కూడా పిల్ దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
న్యాయవాది వసుధా నాగరాజ్ వాదిస్తూ పిల్లలను వారి తల్లులు కలుసుకునే అవకాశం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఓ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశామన్నారు. సిట్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ వారు జన్మనిచ్చిన తల్లులు కాదని, పెంచిన తల్లులని కోర్టుకు నివేదించారు. ఈ కేసులో ఎప్పటిలోపు దర్యాప్తు పూర్తిచేస్తారో, చార్జిషీట్ దాఖలు చేస్తారో తెలపాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) కోర్టు ఆదేశి స్తూ విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment