Man Harassed 5 Year Old Kid In Miyapur: ఐదేళ్ల చిన్నారిని లిఫ్టులోకి లాక్కెళ్లి.. - Sakshi

Miyapur: ఐదేళ్ల చిన్నారిని లిఫ్టులోకి లాక్కెళ్లి.. 

Jul 7 2021 8:03 AM | Updated on Jul 7 2021 1:35 PM

Miyapur: Man Misbehave With 5 Years Old Girl In Lift - Sakshi

సాక్షి, మియాపూర్‌:  అపార్ట్‌మెంట్‌లోకి దూరి అక్కడ ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను లిఫ్టులోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. రాజస్థాన్‌లోని గోరక్‌పూర్‌కు చెందిన గోరక్‌ ప్రసాద్, రేణుక పదేళ్ల నుంచి మియాపూర్‌ హాఫీజ్‌పేట్‌లోని మార్తాండనగర్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటూ ఇంటిరీయర్‌ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.

వీరికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. మూడో కుమార్తె(5) సోమవారం మధ్యాహ్నం దుకాణంలో చాక్లెట్‌ తీసుకొని అపార్ట్‌మెంట్‌ ముందు ఆడుకుంటోంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్‌మెంట్‌లోకి వచ్చి చిన్నారిని అపార్ట్‌మెంట్‌ లిఫ్టులోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. చిన్నారి ఏడ్చుకుంటూ తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement