శంషాబాద్: అదృశ్యమై ముళ్లపొదల్లో శవంగా లభ్యమైన మైనర్‌బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. సొంత మేనమామే అత్యాచారం చేసి ఆపై హత్యకు పాల్పడ్డ దారుణం బయటపడింది. శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వనపర్తి జిలా కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన దంపతులు రెండేళ్లుగా పట్టణంలోని మధురానగర్ కాలనీలో నివాసముంటు కూలీ పనులు చేస్తూ బతుకుతున్నారు. ఈ నెల 11న వీరి కుమార్తె (16) ఇంట్లో నుంచి అదృశ్యమైంది. ఈ నెల 14న రాళ్లగూడ సరీ్వసు రహదారి పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతమైన ముళ్లపొదల్లో బయపడ్డ మృతదేహం బాలికదిగా తల్లిదండ్రులతో పాటు పోలీసులు నిర్ధారించుకుని ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ ఫుటేజీతో పాటు స్థానికంగా ఉన్న ఇతర సమాచారం మేరకు బాలిక తల్లి సోదరుడు జట్పోలు విష్ణు (23)ను పాలెం గ్రామంలో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించడంతో అసలు విషయం బయటపడింది. గత ఏడాదిగా విష్ణు మేనకోడలుతో సఖ్యతగా..సన్నిహితంగా ఉన్నాడు. గత కొన్ని నెలలుగా బాలిక ఇతరులతో చనువుగా ఉండడంతో విష్ణు ఆమెపై కక్ష పెంచుకుని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ మేరకు ఈ నెల 11న సాయంత్రం బాలికను బయటికి రావాలని కోరాడు. రాళ్లగూడ సరీ్వసు రహదారి పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లిన తర్వాత బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న బండరాయితో తలపై మోదాడు. మృతిచెందినట్లు నిర్ధారించుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. శంషాబాద్ ఏసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు సుమన్, తరుణ్‌లు కేసు చేధించిన తీరును డీసీపీ ఈ సందర్భంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment