assaulting students
-
హైదరాబాద్‌లో దారుణం: సొంత మేనమామే అత్యాచారం చేసి ఆపై
శంషాబాద్: అదృశ్యమై ముళ్లపొదల్లో శవంగా లభ్యమైన మైనర్‌బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. సొంత మేనమామే అత్యాచారం చేసి ఆపై హత్యకు పాల్పడ్డ దారుణం బయటపడింది. శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వనపర్తి జిలా కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన దంపతులు రెండేళ్లుగా పట్టణంలోని మధురానగర్ కాలనీలో నివాసముంటు కూలీ పనులు చేస్తూ బతుకుతున్నారు. ఈ నెల 11న వీరి కుమార్తె (16) ఇంట్లో నుంచి అదృశ్యమైంది. ఈ నెల 14న రాళ్లగూడ సరీ్వసు రహదారి పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతమైన ముళ్లపొదల్లో బయపడ్డ మృతదేహం బాలికదిగా తల్లిదండ్రులతో పాటు పోలీసులు నిర్ధారించుకుని ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీతో పాటు స్థానికంగా ఉన్న ఇతర సమాచారం మేరకు బాలిక తల్లి సోదరుడు జట్పోలు విష్ణు (23)ను పాలెం గ్రామంలో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించడంతో అసలు విషయం బయటపడింది. గత ఏడాదిగా విష్ణు మేనకోడలుతో సఖ్యతగా..సన్నిహితంగా ఉన్నాడు. గత కొన్ని నెలలుగా బాలిక ఇతరులతో చనువుగా ఉండడంతో విష్ణు ఆమెపై కక్ష పెంచుకుని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఈ నెల 11న సాయంత్రం బాలికను బయటికి రావాలని కోరాడు. రాళ్లగూడ సరీ్వసు రహదారి పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లిన తర్వాత బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న బండరాయితో తలపై మోదాడు. మృతిచెందినట్లు నిర్ధారించుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. శంషాబాద్ ఏసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు సుమన్, తరుణ్‌లు కేసు చేధించిన తీరును డీసీపీ ఈ సందర్భంగా అభినందించారు. -
వివాదంలో బండి సంజయ్ కుమారుడు.. తోటి విద్యార్థిపై..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడిపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తోటి విద్యార్థిని దుర్భాషలా డుతూ దాడిచేసిన దృశ్యాలు సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టడంతో కలకలం రేగింది. కుత్బు ల్లాపూర్ నియోజకవర్గం బహదూర్‌పల్లిలోని మహేంద్ర వర్సిటీలో బీటెక్ చదువుతున్న సంజయ్ కుమారుడు తోటి విద్యార్థిని అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా, చంపేస్తానంటూ బెదిరిస్తూ తీవ్రంగా కొట్టాడు. దీంతో వర్సిటీకి చెందిన స్టూడెంట్ అపెక్స్ కోఆర్డినేటర్ మంగళవారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ రమణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అందుకే కొట్టాడు: కాగా బండి కుమారుడిపై కేసు నమోదైన విషయం తెలిశాక...అతని చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థి మంగళవారం రాత్రి 11 గంటలకు ఒక వీడియో విడుదల చేశాడు. బండి సంజయ్ కుమారుడు స్నేహితుడి చెల్లెల్ని తాను ఇబ్బంది పెట్టానని, ఆ కారణంతోనే తనపై చేయిచేసుకున్నాడని వీడియోలో పేర్కొన్నాడు. ఇప్పుడు తామంతా మంచిగానే ఉన్నామని చెప్పాడు. -
విద్యార్ధిని పై ఉపాధ్యాయుడు లైంగిక దాడి
-
క్లాస్‌రూమ్‌లో అమ్మాయిల జుట్టు పట్టుకుని..
-
క్లాస్‌రూమ్‌లో అమ్మాయిల జుట్టు పట్టుకుని..
అమ్మాయిలను జుట్టు పట్టుకుని తిప్పుతూ ఉన్మాదిలా ఊగిపోతూ కొట్టాడు. తలకు దెబ్బ తగిలేలా పలుమార్లు బలంగా కొట్టాడు. చెంపలు వాయించాడు. అమ్మాయిలను గొడ్డును బాదినట్టు బాదాడు. ఇక అబ్బాయిలపైనా ఇదే ప్రతాపం చూపించాడు. దెబ్బలు తిన్న ఈ అమ్మాయిలు, అబ్బాయిలు నేరస్తులేమీ కాదు.. భావి భారత విద్యార్థులు. హోం వర్క్ చేయకపోవడమే వీళ్లు చేసిన నేరం. వీధి రౌడీలా ప్రవర్తించిన ఆ వ్యక్తి టీచర్. హరియాణాలోని కర్నల్‌లో టీచర్ చేసిన నిర్వాకాన్ని ఓ విద్యార్థి రహస్యంగా వీడియో తీశాడు. కర్నల్‌లోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో టీచర్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఈ టీచర్‌ను ప్రదీప్ ఆరోరాగా గుర్తించారు. కోచింగ్ సెంటర్ యజమాని కూడా ఇతడే. హోం వర్క్ చేయని 10, ఇంటర్ విద్యార్థులను దారుణంగా కొట్టాడు. క్లాస్‌లో వెనుక వైపు కూర్చున్న ఓ విద్యార్థి మొబైల్ ఫోన్‌తో టీచర్ నిర్వాకాన్ని వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ఓ టీవీలో ప్రసారమవడంతో టీచర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీవీలో ప్రసారమైన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్టు కర్నల్ ఎస్పీ పంకజ్ నైన్ చెప్పారు. కాగా విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ టీచర్‌పై ఫిర్యాదు చేయలేదు. ప్రదీన్ అరోరా రిటైర్డ్ నేవీ ఉద్యోగి. మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు ఎలాంటి శిక్షయినా వేయాలని తల్లిదండ్రులు తనకు చెప్పారని వివరణ ఇచ్చాడు.