కోడి పిల్లలు అనుకుంటే పొరపాటే.. | Trending Video Yellow Frogs In Madhya Pradesh Narsinghpur | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో.. కప్పలు ఇలా కూడా ఉంటాయా..!

Published Mon, Jul 13 2020 1:49 PM | Last Updated on Mon, Jul 13 2020 2:00 PM

Trending Video Yellow Frogs In Madhya Pradesh Narsinghpur - Sakshi

భోపాల్‌: కప్ప అంటే సాధారణంగా ఆకుపచ్చ వర్ణంలో ఉంటుందని మనందరికి తెలిసిన విషయమే. కానీ పసుపు రంగులో ఉన్న కప్పలను ఎప్పుడైనా చూశారా. అది కూడా భారీ సంఖ్యలో. లేదు కదా అయితే ఈ వీడియో చూడండి. పదుల సంఖ్యలో పసుప పచ్చ వర్ణంలో ఉన్న కప్పలు వాన నీటిలో ఆడుతున్న దృశ్యాలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. సడెన్‌గా చూస్తే.. కోడిపిల్లల్లా అనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌ వద్ద ఈ అరుదైన దృశ్యం కనిపించింది. దీన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.
 

‘మీరు ఎప్పుడైనా పసుపు పచ్చ వర్ణంలో ఉన్న కప్పలను చూశారా. అయితే ఇప్పుడు చూడండి. ఇండియన్‌ బుల్‌ ఫ్రాగ్‌ జాతికి చెందిన ఈ పసుపు రంగు కప్పలు నర్సింగ్‌పూర్‌లో కనిపించాయి. ఆడ కప్పలను ఆకర్షించడం కోసం ఇవి ఇలా పసుపు రంగులోకి మారతాయి. వాన నీటిలో ఎంత బాగా ఎంజాయ్‌ చేస్తున్నాయో చూడండి’ అంటూ షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అయితే ఈ కప్పలు ఎప్పుడు ఇంత ప్రకాశవంతమైన పసుపు​ రంగులో ఉండవు. కేవలం సంతానోత్పత్తి కాలంలో అది కూడా వర్షాకాలంలో మాత్రమే ఆడకప్పలను ఆకర్షించడానికి ఇలా పూర్తిగా పసుపు వర్ణంలోకి మారతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement