
తెయూ (డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ బాలికల హాస్టల్‌లో బుధవారం ఉదయం అల్పాహారంలో భాగంగా అందించిన వెజ్ రైస్‌లో కప్ప రావడంతో విద్యార్థినులు ఆందో ళనకు గురయ్యారు. అప్పటికే పలువురు విద్యార్థినులు అల్పాహారం తిని తరగతులకు వెళ్లారు. ఈ విషయాన్ని హాస్టల్ చీఫ్ వార్డెన్ అబ్దుల్ ఖవీ, బాలికల హాస్టల్ వార్డెన్ జవేరి యా ఉజ్మా, కేర్‌టేకర్ పీరూబాయిల దృష్టికి తీసుకెళ్లారు. వెజ్‌రైస్‌లో కప్ప వచ్చిన మాట నిజమేనని.. మరోసారి తప్పు జరగకుండా జాగ్రత్త పడతామని కుక్ తెలిపారు.