సాక్షి,వరంగల్: కూల్‌డ్రింక్ అనుకుని పురుగులమందు తాగి ఓ విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని మరికాల పంచాయతీ తోగుబోరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పూనెం సురేష్(11) అనే విద్యార్థి గురువారం ఉదయం ఇంట్లో కూల్‌డ్రింక్ సీసాలో పురుగుల మందు ఉందని తెలియక కూల్‌డ్రింక్ తాగాడు. అనంతరం వాంతులు చేసుకుంటుండగా గమనించిన కుటుంబ సభ్యులు సురేష్‌ను వె ంకటాపురం వైద్యశాలకు తరలించి చి కిత్స నిర్వహించే లోపే మృతి చె ందా డని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని చెప్పి..
Comments
Please login to add a commentAdd a comment