
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,బయ్యారం(వరంగల్): మండలంలోని గౌరారం పంచాయతీ పరిధి కోడిపుంజుల తండాలో ఒకే రోజు మునిమనవరాలు, తాతమ్మ మృతి చెందడంతో తండాలో విషాదం నెలకొంది. సమయానికి వైద్యం అందక గర్భిణి రేణుక ప్రసవ సమయంలో బుధవారం మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. రేణుక మృతదేహాన్ని బుధవారం రాత్రి ఇంటికి తీసుకురాగా విషయం తెలుసుకున్న జాంకీ(80) గురువారం తెల్లవారుజామున మృతి చెందింది.
ఒకే ఇంట్లో ఒక రోజు వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రేణుక, జాంకీ మృతదేహాలకు జెడ్పీ చైర్‌పర్సన్ బిందు గురువారం నివాళులు అర్పించారు. వైస్ ఎంపీపీ గణేశ్, సర్పంచ్ వెంకన్న, ఎంపీటీసీ భద్రయ్య, సొసైటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, టీఆర్‌ఎస్ మండల ప్రధానకార్యదర్శి రాంమూర్తిగౌడ్, నాయకులు లక్ష్మణ్‌నాయక్, రామారావు, లింగయ్య, మల్సూర్ నివాళులు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment