
కశ్మీర్, లడఖ్, సంప్రదాయ నృత్యం, గిన్నిస్ రికార్డు, నపోరా పండుగ, షాండోల్ నృత్యం
కశ్మీర్‌లోని లడఖ్ ప్రాంత మహిళలు సంప్రదాయ నృత్యంతో గిన్నిస్ రికార్డు సృష్టించారు. నపోరా పండుగ సందర్భంగా 299 మంది మహిళలు లడఖ్ సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా షాండోల్ నృత్యం చేశారు. దీంతో అత్యధిక మంది ప్రజలు ఓ చోట గుమిగూడి షాండోల్ నృత్యం చేసినట్లు గిన్నిస్ ప్రతినిధి సర్టిఫికెట్ ఇచ్చారు. బౌద్ధ పండితుడు, సన్యాసి నపోరా బోధనలు, జీవిత విశేషాలను సంప్రదాయ నృత్యంలో ప్రదర్శిస్తారు.