సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. లద్దాఖ్‌లోని లేహ్‌లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12.30 గంటల సమయంలో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనలకు గురైనట్టు చెప్పారు. ఇళ్లనుంచి జనం పరుగులు తీశారని, భూ ప్రకంపనల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.
ఇదిలాఉండగా.. దాయాది దేశం పాకిస్తాన్‌లో కూడా భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.7 గా నమోదైంది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భూకంప తీవ్రతగా అధికంగా ఉండటంతో వందలాది పలు ఇల్లు, భవనాలు కూలిపోయాయి.
(చదవండి: మాదకద్రవ్యాల స్వర్గధామంగా ముంబై? )
Comments
Please login to add a commentAdd a comment