తెలంగాణ సాంస్కృతిక వేడుక బతుకమ్మ పండుగ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో ఎక్కేందుకు సన్నద్ధమవుతుండగా.. ఊహించనిరీతిలో వరుణుడు విరుచుకుపడ్డాడు. ఎల్బీ స్టేడియంలో శనివారం మహా బతుకమ్మ వేడుక కోసం ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది. గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా పదివేల మందితో బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేశారు. 20 అడుగుల ఎత్తుతో మహా బతుకమ్మను తీర్చిదిద్దారు. 35 వరుసల్లో పదివేల మంది మహిళలు బతుకమ్మ ఆడేలా వీలు కల్పించారు. మహిళలు, చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి.. రంగురంగులో పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొని ఎల్బీ స్టేడియం చేరుకున్నారు. మైదానం నిండా సందడి వాతావరణం నెలకొంది. గిన్నిస్ రికార్డులో భాగంగా మహిళలు బతుకమ్మ ఆడుతుండగానే.. ఇంతలోనే వరుణుడు అడ్డుపడ్డాడు. హైదరాబాద్‌ను మరోసారి భారీ వర్షం పలుకరించింది. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో బతుమ్మ ఆడాలనుకున్న మహిళలు వెనక్కితగ్గారు. వర్షం వెలిస్తే తప్ప ఈ సంబురం అంగరంగ వైభవంగా జరిగే అవకాశం లేదని అక్కడి నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
Published Sat, Oct 8 2016 4:56 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement