
బెల్జియం జట్టు కెప్టెన్ ఈడెన్ హజార్డ్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో బెల్జియం లీగ్ దశలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. బెల్జియం ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ పదవితో పాటు ఆటకు గుడ్‌బై చెప్పినట్లు హజార్డ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు.
2008లో 17 ఏళ్ల వయసులో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన ఈడెన్ హజార్డ్ బెల్జియం తరపున 126 మ్యాచ్‌లు ఆడాడు. అతని 14 ఏళ్ల కెరీర్‌లో 33 గోల్స్ నమోదు చేశాడు. లక్సమ్‌బర్గ్‌తో మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన హజార్డ్ మూడు ఫిఫా వరల్డ్‌కప్స్‌తో పాటు రెండు యూరోపియన్ ఛాంపియన్‌షిప్స్ ఆడాడు. హజార్డ్ 56 మ్యాచ్‌ల్లో బెల్జియం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఇక ఈడెన్ హజార్డ్ తన రిటైర్మెంట్‌పై స్పందించాడు. ''ఈరోజు నా పేజీ ముగిసింది. 2008 నుంచి ఇప్పటివరకు నాకు అండగా నిలబడిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్'' అంటూ ఎమెషనల్‌గా పేర్కొన్నాడు. రెడ్ డెవిల్స్‌గా పేరు పొందిన బ్రెజిల్ ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశకే పరిమితమైంది. క్రొయేషియా, మొరాకో, కెనడాలతో కలిసి ఒకే గ్రూప్‌లో ఉన్న బెల్జియం.. ఒకే ఒక విజయాన్ని నమోదు చేసింది.
కెనడాపై విజయం అందుకున్న బెల్జియం.. మొరాకోతో మ్యాచ్‌లో 2-0తో పరాజయం పాలైంది. ఆ తర్వాత క్రొయేషియాతో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో డ్రా చేసుకోవడం బెల్జియం కొంపముంచింది. మ్యాచ్ డ్రాతో క్రొయేషియా, మొరాకోలు నాకౌట్ దశకు చేరగా.. కెనడాతో పాటు బెల్జియం ఇంటిదారి పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment