Eden Hazard
-
ఓటమికి నైతిక బాధ్యత.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్‌బాలర్
బెల్జియం జట్టు కెప్టెన్ ఈడెన్ హజార్డ్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో బెల్జియం లీగ్ దశలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. బెల్జియం ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ పదవితో పాటు ఆటకు గుడ్‌బై చెప్పినట్లు హజార్డ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. 2008లో 17 ఏళ్ల వయసులో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన ఈడెన్ హజార్డ్ బెల్జియం తరపున 126 మ్యాచ్‌లు ఆడాడు. అతని 14 ఏళ్ల కెరీర్లో 33 గోల్స్ నమోదు చేశాడు. లక్సమ్బర్గ్తో మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన హజార్డ్ మూడు ఫిఫా వరల్డ్‌కప్స్‌తో పాటు రెండు యూరోపియన్ ఛాంపియన్షిప్స్ ఆడాడు. హజార్డ్ 56 మ్యాచ్‌ల్లో బెల్జియం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక ఈడెన్ హజార్డ్ తన రిటైర్మెంట్పై స్పందించాడు. ''ఈరోజు నా పేజీ ముగిసింది. 2008 నుంచి ఇప్పటివరకు నాకు అండగా నిలబడిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్'' అంటూ ఎమెషనల్‌గా పేర్కొన్నాడు. రెడ్ డెవిల్స్‌గా పేరు పొందిన బ్రెజిల్ ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశకే పరిమితమైంది. క్రొయేషియా, మొరాకో, కెనడాలతో కలిసి ఒకే గ్రూప్‌లో ఉన్న బెల్జియం.. ఒకే ఒక విజయాన్ని నమోదు చేసింది. కెనడాపై విజయం అందుకున్న బెల్జియం.. మొరాకోతో మ్యాచ్‌లో 2-0తో పరాజయం పాలైంది. ఆ తర్వాత క్రొయేషియాతో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో డ్రా చేసుకోవడం బెల్జియం కొంపముంచింది. మ్యాచ్ డ్రాతో క్రొయేషియా, మొరాకోలు నాకౌట్ దశకు చేరగా.. కెనడాతో పాటు బెల్జియం ఇంటిదారి పట్టింది. View this post on Instagram A post shared by Eden Hazard (@hazardeden_10) చదవండి: మూతిపళ్లు రాలినా క్యాచ్ మాత్రం విడువలేదు FIFA WC 2022: రొనాల్డో కోసం ఏదైనా.. టాప్‌లెస్‌గా దర్శనం -
UEFA EURO 2020: పోర్చు‘గల్లంతు’
సెవిల్లె (స్పెయిన్): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ పోర్చుగల్ జట్టు కథ ముగిసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బెల్జియం 1–0 గోల్ తేడాతో క్రిస్టి యానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టును ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. ఆట 42వ నిమిషంలో ఎడెన్ హజార్డ్ గోల్‌తో బెల్జియం ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఇటలీతో బెల్జియం ఆడుతుంది. సోమవారం జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 5–3తో క్రొయేషియాను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
మెరుగ్గా ఆడాల్సిందే...
గతేడాది పేలవ ఫామ్‌తో ఇబ్బంది ఎదుర్కొన్న చెల్సీ మిడ్ ఫీల్డర్ ఈడెన్ హజార్డ్ ప్రస్తుత ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) ఫుట్‌బాల్ సీజన్లో దుమ్మురేపుతున్నాడు. పారుుంట్ల పట్టికలో టాప్‌లో ఉన్న చెల్సీకి తను ప్రస్తుతం కీలక ఆటగాడిగా మారాడు. తన కెరీర్లోనే అత్యుత్తమంగా ఆడుతున్న ఈ బెల్జియన్ ఇప్పటికే ఏడు గోల్స్ నమోదు చేశాడు. నేడు (శనివారం) మాంచెస్టర్ సిటీతో జరిగే పోరులో బరిలోకి దిగబోతున్న హజార్డ్ చెప్పిన విషయాలు అతడి మాటల్లోనే... ఈ సీజన్‌ను చెల్సీ మెరుగ్గా ఆరంభించింది. టైటిల్ రేసులో ఉండేందుకు ఈ మ్యాచ్ కీలకంగా భావిస్తున్నారా? కచ్చితంగా. ఎందుకంటే టైటిల్ పోరులో మాంచెస్టర్ సిటీ, లివర్‌పూల్ మాకు గట్టి పోటీదారులు. రెండు పటిష్ట జట్లే కాకుండా చాలా బాగా ఆడుతున్నారుు. చివరి వరకు ఉండాలనుకుంటే ఆ రెండు జట్లకన్నా మెరుగ్గా ఆడాల్సిందే. మాంచెస్టర్ సిటీని ఓడించి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాలనుకుంటున్నారా? అవును. ఎతిహాద్‌లో మ్యాచ్ గెలవడం చాలా కష్టం. ఆ జట్టులో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లున్నారు. అగెరో, డి బ్రూనే ప్రమాదకరమే. ఇదో మంచి మ్యాచ్ కావడంతో పాటు మాకు విజయం లభిస్తే మరింత లాభం. ఇలాంటి పెద్ద మ్యాచ్‌లు ఓడితే ఎలా ఫీలవుతారు? మాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో.. ఎందుకంటే ఇప్పటికే మేము అర్సెనల్, లివర్‌పూల్‌పై ఓడాం. అలాంటి ఓటమి మరోటి కావాలనుకోవడం లేదు. ఇప్పుడైతే మేం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. -
క్వార్టర్స్‌లో బెల్జియం
టౌలోస్ (ఫ్రాన్స్): అంచనాలకు అనుగుణంగా ఆడలేకపోతున్న బెల్జియం స్టార్ ఫార్వర్డ్ ఆటగాడు ఈడెన్ హజార్డ్ ఎట్టకేలకు జూలు విదిల్చాడు. టోర్నీలో తొలి గోల్ సాధించడంతో పాటు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆదివారం హంగెరీతో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో బెల్జియం 4-0తో ఘనవిజయం సాధించి క్వార్టర్స్‌లో ప్రవేశించింది. ఓ మేజర్ టోర్నీలో ఈ జట్టుకు ఇదే భారీ విజయం. అలాగే 1980 యూరో అనంతరం క్వార్టర్స్ చేరడం ఇదే తొలిసారి. బెల్జియం తరఫున అల్డర్వీరెల్డ్ (10), బట్షువాయి (78), హజార్డ్ (80), కరాస్కో (90) గోల్స్ సాధించారు. క్వార్టర్స్‌లో ఈ జట్టు వేల్స్‌తో ఆడుతుంది.