గతేడాది పేలవ ఫామ్‌తో ఇబ్బంది ఎదుర్కొన్న చెల్సీ మిడ్ ఫీల్డర్ ఈడెన్ హజార్డ్ ప్రస్తుత ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) ఫుట్‌బాల్ సీజన్లో దుమ్మురేపుతున్నాడు. పారుుంట్ల పట్టికలో టాప్‌లో ఉన్న చెల్సీకి తను ప్రస్తుతం కీలక ఆటగాడిగా మారాడు. తన కెరీర్లోనే అత్యుత్తమంగా ఆడుతున్న ఈ బెల్జియన్ ఇప్పటికే ఏడు గోల్స్ నమోదు చేశాడు. నేడు (శనివారం) మాంచెస్టర్ సిటీతో జరిగే పోరులో బరిలోకి దిగబోతున్న హజార్డ్ చెప్పిన విషయాలు అతడి మాటల్లోనే...
ఈ సీజన్‌ను చెల్సీ మెరుగ్గా ఆరంభించింది. టైటిల్ రేసులో ఉండేందుకు ఈ మ్యాచ్ కీలకంగా భావిస్తున్నారా?
కచ్చితంగా. ఎందుకంటే టైటిల్ పోరులో మాంచెస్టర్ సిటీ, లివర్‌పూల్ మాకు గట్టి పోటీదారులు. రెండు పటిష్ట జట్లే కాకుండా చాలా బాగా ఆడుతున్నారుు. చివరి వరకు ఉండాలనుకుంటే ఆ రెండు జట్లకన్నా మెరుగ్గా ఆడాల్సిందే.
మాంచెస్టర్ సిటీని ఓడించి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాలనుకుంటున్నారా?
అవును. ఎతిహాద్‌లో మ్యాచ్ గెలవడం చాలా కష్టం. ఆ జట్టులో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లున్నారు. అగెరో, డి బ్రూనే ప్రమాదకరమే. ఇదో మంచి మ్యాచ్ కావడంతో పాటు మాకు విజయం లభిస్తే మరింత లాభం.
ఇలాంటి పెద్ద మ్యాచ్‌లు ఓడితే ఎలా ఫీలవుతారు?
మాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో.. ఎందుకంటే ఇప్పటికే మేము అర్సెనల్, లివర్‌పూల్‌పై ఓడాం. అలాంటి ఓటమి మరోటి కావాలనుకోవడం లేదు. ఇప్పుడైతే మేం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం.