jamica sprinter
-
వరుస పసిడి పతకాలు.. ఏకైక మహిళా అథ్లెట్‌గా
ఒలింపిక్స్ మహిళల అథ్లెటిక్స్‌లో జమైకా అథ్లెట్ ఎలైన్ థాంప్సన్ హెరా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మంగళవారం జరిగిన మహిళల 200 మీటర్ల ఫైనల్ రేసులో ఆమె విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా ‘స్ప్రింట్’ రేసుల్లో ‘డబుల్’ సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ ఎలైన్ 100, 200 మీటర్ల విభాగాల్లో బంగారు పతకాలు గెల్చుకుంది. ఫలితంగా వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణాలు నెగ్గిన ఏకైక మహిళా అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. పురుషుల విభాగంలో మాత్రం ఉసేన్ బోల్ట్ (జమైకా) వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచాడు. టోక్యో: ఒలింపిక్స్‌లో స్ప్రింట్ రేసు అంటే ఠక్కున గుర్తుకువచ్చే పేరు ఉసేన్ బోల్ట్. అతడు అంతలా స్ప్రింట్ రేసులను తన ప్రదర్శనతో ప్రభావితం చేశాడు. తాజా ఒలింపిక్స్‌లో అటువంటి ప్రదర్శననే జమైకన్ మహిళా స్ప్రింటర్ ఎలైన్ థామ్సన్ హెరా ప్రపంచానికి చేసి చూపింది. ఒకవైపు స్ప్రింట్ రేసుల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన జమైకన్ పురుష అథ్లెట్లు విఫలమవుతుంటే... మహిళల విభాగంలో మాత్రం ఎలైన్ అదరగొట్టింది. నాలుగు రోజుల క్రితం మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన ఆమె మరోసారి మెరిసింది. మంగళవారం జరిగిన 200 మీటర్ల పరుగులోనూ పసిడిని తెచ్చే ప్రదర్శనను చేసింది. 21.53 సెకన్లలో అందరికంటే ముందుగా రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. తద్వారా స్ప్రింట్ (100, 200 మీటర్లు) ఈవెంట్లను క్లీన్ స్వీప్ చేసింది. 2016 ‘రియో’లోనూ థామ్సన్ స్ప్రింట్ ఈవెంట్లను క్లీన్ స్వీప్ చయడం విశేషం. ఇలా రెండు వరుస ఒలింపిక్స్‌ల్లోనూ 100, 200 మీటర్లలో స్వర్ణాలు సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా చరిత్రకెక్కింది. క్రిస్టినే ఎమ్‌బోమా (నమీబియా; 21.81 సెకన్లు) రజతం... గాబ్రియేలా థామస్ (అమెరికా; 21.87 సెకన్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. ఈ నెల 6న జరిగే మహిళల 4*100 టీమ్ రిలేలోనూ ఎలైన్ థామ్సన్ బరిలోకి దిగనుంది. Elaine Thompson-Herah does it again! It is the double-double for the #JAM sprint queen in 21.53!#Gold women’s 200m Tokyo 2020#Gold women’s 100m Tokyo 2020#Gold women’s 200m Rio 2016#Gold women’s 100m Rio 2016@WorldAthletics | #StrongerTogether | #Tokyo2020 | #Athletics pic.twitter.com/AENA2JzT1X — Olympics (@Olympics) August 3, 2021 -
మరో ఆటకు గుడ్‌బై చెప్పిన బౌల్ట్
కింగ్స్టన్(జమైకా): ఫ్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడిగా మారాలన్న తన కలలకు స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ గుడ్ బై చెప్పాడు. ఈ పరుగుల రారాజు గతేడాది స్ప్రింట్ ఫీల్డ్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఫ్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడిగా మారాలన్న తన చిన్ననాటి కోరిక నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని సెంట్రల్ కోస్ట్ మెరైన్ ఫుట్‌బాల్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకొని అందులో చేరాడు. ఒకట్రెండు సన్నాహక మ్యాచ్‌ల్లో గోల్స్ సైతం కొట్టాడు. అయితే, ఆ తర్వాత ఆ జట్టుతో ఒప్పందం రద్దవడం, యూరోపియన్ క్లబ్‌ల్లో చేరాలన్న ప్రయత్నం నెరవేరకపోవడంతో చివరికి ఫ్రొఫెనల్ పుట్‌బాల్ ఆటగాడిగా మారాలన్న తన కలలకు పుల్‌స్టాప్ పెట్టాడు. ఈ విషయాన్ని బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా వెల్లడించిన బోల్ట్ త్వరలో తాను బిజనెస్లోకి దిగుతున్నట్లు ప్రకటించాడు. -
2016 రియోలో గెలిస్తే.. లెజెండ్ అవుతా
మెక్సికో సిటీ: స్ప్రింట్‌లో ప్రపంచ రికార్డులు సృష్టించిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్.. 2016 రియో ఒలింపిక్స్‌పై గురిపెట్టాడు. రియోలోనూ పతకాలు గెలిస్తే లెజెండ్ అవుతానిన బోల్ట్ అన్నాడు. స్ప్రింట్‌లో ఎదురులేని బోల్ట్ 100, 200 మీటర్ల రేసుల్లో ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు సాధించిన సంగతి తెలిసిందే. 'రియోలోనూ గెలిస్తే అమితంగా సంతోషిస్తాను. లెజెండ్ అవుతాను. అప్పుడు ఎవరైనా అడిగితే నేను లెజెండ్ అని చెబుతాను' అని బోల్ట్ అన్నాడు. వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్ కోసం వచ్చే నెలలో సాధన ప్రారంభిస్తానని చెప్పాడు. బీజింగ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపాడు. -
లండన్ ఒలింపిక్స్ స్టేడియానికి బోల్ట్
లండన్: జమైకా చిరుత, స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్‌కు లండన్ ఒలింపిక్స్ స్టేడియంతో ప్రత్యేక అనుబంధముంది. మూడేళ్ల క్రితం ఈ వేదికపై జరిగిన ఒలింపిక్స్‌లో బోల్ట్ చరిత్ర సృష్టించాడు. 100, 200 మీటర్ల రేసుతో పాటు 4x400 మీ రిలేలో బోల్ట్ స్వర్ణ పతకాలు సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. మూడేళ్ల తర్వాత బోల్ట్ మళ్లీ ఈ స్టేడియానికి వస్తున్నాడు. ఈ నెలలో ఈ వేదికపై జరిగే డైమండ్ లీగ్‌లో పాల్గొననున్నాడు. 100 మీటర్ల రేసులో పాల్గొననున్నట్టు బోల్డ్ ప్రకటించాడు. ఈ స్టేడియంలో తనకు మధురానుభూతులున్నాయని అన్నాడు. కాగా కాలిగాయం కారణంగా బోల్ట్ ఇటీవల పారిస్, లాసన్నె రేసుల నుంచి వైదొలిగాడు.