
బోల్ట్ షూ ఎంత ధర పలికాయో తెలుసా?
లండన్: పరుగుల చిరుత ఉస్సేన్ బోల్ట్ ఉయోగించి సంతకం చేసిన రన్నింగ్ షూ వేలంలో భారీ మొత్తం రాబట్టాయి. ఆన్ లైన్ లో నిర్వహించిన వేలంలో దాదాపు పన్నెండు లక్షలకు(16 వేల యూరోలు) అమ్ముడుపోయాయి.
గత ఏడాది బీజింగ్ లో వరల్డ్ చాంపియన్ షిప్ 2015 జరిగిన విషయం తెలిసిందే. ఇందులో పాల్గొన్న బోల్ట్ 100 మీటర్ల పరుగు కోసం ఈ ట్రాక్ షూను ఉపయోగించాడు. అమెరికాకు చెందిన జస్టిన్ గాట్లిన్ పై బోల్ట్ ఆ సమయంలో విజయం సాధించి బంగారు పతకాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ షూ కోసం చివరిగా మొత్తం 30 బిడ్లు పోటీ పడ్డాయి.