జమైకా చిరుత.. స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ పరుగులు తీయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. కానీ ఈ సారి నేల మీద కాదు.. జీరో గ్రావిటీ వాతావరణంలో పరుగులు తీశాడు. తనతోపాటు పోటీలో పాల్గొన్న ఫ్రెంచ్ వ్యోమగామి జీన్ ఫ్రాంకోయిస్, నోవెస్పేస్ సీఈవో ఆక్టేవ్ డి గల్లె వారితో కలిసి పరుగులు తీశాడు. ఈ పందెంలో తొలుత తడబడిన బోల్ట్ చివర్లో మాత్రం విజేతగా నిలిచాడు. జీరో స్పేస్ సాంకేతికత తెలిసిన వారిపై అదే వాతావరణంలో సరదాగా జరిగిన రేస్‌లో గెలిచి తన సత్తా చాటాడు.